శ్వాసను సరిచేసేందుకు కొత్త యంత్రం...

18 May, 2018 02:17 IST|Sakshi

సైనసైటిస్‌ వంటి సమస్యలుంటే ఎంత ఇబ్బందో మనకు తెలియంది కాదు. సరిగా నిద్ర పట్టదు. ఊపిరితీసుకోవడం కష్టమైపోతుంది. ముక్కు లోపలి భాగాల్లో ఊపిరి లోనికి చేరనీయని స్థాయిలో కండరాలు పెరిగిపోతే కూడా ఇవే రకమైన ఇబ్బందులు ఎదురవుతూంటాయి. మందులేసుకోవడం... సమస్య మరీ ఎక్కువైతే, చిన్నపాటి ఆపరేషన్‌ చేయించుకోవడం... ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానాలు. కాకపోతే ఈ రెండు పద్ధతులతో లభించేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ నేపథ్యంలో ఓహాయో స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యలకు ఓ వినూత్నమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని ఆవిష్కరించారు.

రేడియో తరంగాల శక్తిని ఉపయోగించి శ్వాసకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రాంతాలను సరిచేయడం కోసం వీరు వివావెర్‌ నాసల్‌ ఎయిర్‌వే రీమోడలింగ్‌ డివైజ్‌ను తయారుచేశారు. వాయు నాళానికి అడ్డుగా ఉన్న వృదులాస్థి కణజాలం ఆకారాన్ని కొద్దిగా మార్చడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశమని, ఆపరేషన్‌ టేబుల్‌పై కాకుండా.. ఔట్‌ పేషంట్‌ విభాగంలోనే చికిత్స పూర్తి చేయగలగడం దీని ప్రత్యేకత అని ఈ పరికరం తయారీలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్‌ బ్రాడ్‌ ఒట్టో తెలిపారు.  

>
మరిన్ని వార్తలు