నూతన వస్తు వాహనాలు సమకూరతాయి

24 Jul, 2015 22:58 IST|Sakshi
నూతన వస్తు వాహనాలు సమకూరతాయి

జూలై 25 నుంచి జూలై 31 వరకు
 
 టారో బాణి
 
 మీకూ, మీ భాగస్వామికీ మధ్య కొత్తబంధం ఏర్పడవచ్చు. ఈ వారమంతా భావోద్వేగాలతో గడుపుతారు. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీ సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులన్నీ ఫలించి, ఆర్థికపరంగా ఏదో గారడీ చేసినట్లుగా ధనసమృద్ధి కలుగుతుంది. కలిసొచ్చేరంగు: పసుప్పచ్చ

ఈ వారం మీకు కొత్త అవకాశాలతో అభివృద్ధికరంగా ఉంటుంది. విదేశీవ్యక్తి నుంచి మీకు ఒక ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. జీవితంలో సమత్యులత కోసం సామరస్యత కోసం రకరకాల త్యాగాలు చేయవలసి వస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు, ఆ మేరకు మనశ్శాంతి లభిస్తుంది కనక. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే

 అదృష్టం, ఆదాయ వృద్ధి కలిసికట్టుగా వస్తాయి. మీకు సంతోషాన్నిచ్చేలా విలువైన, అపురూపమైన బహుమతులు అనూహ్యంగా లభిస్తాయి. జాయింటుగా చేసే ఫైనాన్స్ వ్యాపారావకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ప్రేమికులకు మీ మనసులో దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు తగిన ధైర్యం వస్తుంది. కలిసొచ్చేరంగు: పర్పుల్

 వ్యక్తిగతంగా ఇది మీకు బాగా కలిసొచ్చే వారం. మీ సౌంద ర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తారు. మీ మేధస్సుకు పదును పెట్టుకుంటారు.
 కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ

మీ సామర్థ్యాల మీద దృష్టి పెట్టండి. కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ కూడా ఇది మీకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వారం. ప్రపంచాన్నే జయించగలననేంత శక్తి వస్తుంది మీకు. ప్రేమికురాలిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది తగిన సమయం. ఏదైనా సరే,  చేతులు దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ

 ఈ వారమంతా ప్రయాణాలతో గడుపుతారు. అయితే యాంత్రికమైన, వృత్తిపరమైన ప్రయాణాలు కాదు... ఆహ్లాదకరంగా, మీ మనసుకు, శరీరానికి కూడా కొత్త శక్తినిచ్చే టూర్లతో... మీ జీవన శైలి మారుతుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదం ఏర్పడవచ్చు. కెరీర్‌పరంగా మీ దిశ ఏమిటనేది నిర్ధారించుకోవలసి వస్తుంది. కలిసొచ్చే వారం: రాగిరంగు

 ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్యం కెరీర్‌పరంగానూ, వ్యాపార పరంగానూ మీకు లబ్ధి చేకూర్చవచ్చు. మీ బంధాన్ని కొనసాగించాలనుకుంటే మీ ఆలోచనా సరళిలో, వ్యవహార శైలిలో మార్పు చేసుకోక తప్పదని గ్రహించండి. మీరు మారడానికి ఇదే చివరి అవకాశం. సంగీతం వింటూ, పాడుతూ ఉంటే మీ అంతర్గత శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

 జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనంతట తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చే రంగు: లేత నీలం

 ఈ వారం మీకు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. మీరు సాధించిన ప్రాపంచిక లేదా వ్యాపార లాభాలతో ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీకంటూ బలమైన నమ్మకాలు, విలువలతో కూడిన విశ్వాసాలను, అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఇతరులతో మీ మనసులోని మాటను చెప్పుకుని ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: పచ్చ అరటి పండు రంగు

 మీ ప్రేమను సఫలం చేసుకోవడానికి ఇది తగిన సమయం. అయితే అది అంత సులువు కాదు. పెద్ద యుధం చేయవలసి రావచ్చు. అనేకరకాల సమస్యలు, సవాళ్లతో సహవాసం చేయవలసి ఉంటుంది. శాంతి కావాలనుకుంటే ప్రేమను త్యజించక తప్పదు. యుద్ధం చేస్తే విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: పీచ్

 రకరకాల తాయిలాలతో కూడిన స్కీములు మిమ్మల్ని అయోమయంలో పడేయవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో అనేకరకాల ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వైవాహిక బంధంలో పడతారు. రకరకాల ప్రలోభాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి. ప్రేమ కోసం పరితపిస్తున్న మీకు మీ మనసును దోచుకునే వ్యక్తి ఎదురు అవుతారు. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు

 మీ కోరికలు నెరవేరతాయి. వేడుకలు జరుపుకోవలసి రావచ్చు. మీ మార్గంలో అడ్డుగా నిలిచిన రకరకాల సవాళ్లు, సమస్యలను, అవరోధాలను తేలికగా అధిగమించగలుగుతారు. ఎంతోకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కొన్ని మానసిక సమస్యలను ఒక పెద్ద మనిషి సహకారంతో పరిష్కరించుకుని, ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
ఇన్సియా కె.
టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
సౌర వాణి

 
ఈ వారంలో నేత్రాలకి లేదా శిరస్సుకి సంబంధించిన బాధలుండే అవకాశముంది కాబట్టి, తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువులు వచ్చిన సందర్భంలో మన ఇంటి విషయాలని చెప్పి సలహాలనీ సూచనలనీ అడగటం, వాళ్లు చెప్పబోతే వినడం కానీ మంచిది కాదు. అనవసర విషయాలు తలకెక్కించుకోకుండా గుంభనం పాటించడం మంచిది.

 మీ పై అధికారికి మీకు తోచిన మంచినీ వెసులుబాటునీ సూచించక, చెప్పింది చేసుకుంటూ వెళ్లిపొండి. ఇంట్లో సొంత నిర్ణయాన్ని చేసేస్తూ వెళ్లిపోవడం ఈ వారంలో మంచిది కాదు. తప్పించుకునే ధోరణిలో కాకుండా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మెత్తని గొంతుతో చెబుతూ అవతలివారు నొచ్చుకోకుండా ఉండేలా మొహమాటం లేకుండా మాట్లాడండి బంధువుల విషయంలో.

 ఏ పనినీ చేసుకోలేకపోతున్నామని నిరాశ పడకండి. మీ సంతానం గాని సహాయ పడడానికి రమ్మని పిలిస్తే దూరాభారమని వెళ్లడం మానక, తప్పక వెళ్లండి. మీ వ్యాపారంలో భాగస్వాముల మాటకి విలువనిస్తూ అనుభవజ్ఞుల్ని సంప్రదించి వారి మాటలో ఎంత అనునసరించ వీలుందో ఆ విషయాన్ని వారికి వివరించి చెప్పండి. వ్యతిరేక పరిస్థితులేమీ లేవు - రావు.

 ధనాదాయమైతే బాగుంటుంది కాని తప్పనిసరి ప్రయాణాలు కొంత శారీరక శ్రమని కలిగిస్తాయి. శత్రువులతో విరోధాన్ని పెంచుకునేలా మాటలతో యుద్ధం చేయడం కంటె వాళ్లతో తగినంత దూరంలో ఉండడం ఎంతైనా మంచిది. నూతన వస్తు వాహనాలు సమకూరే అవకాశముంది. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు.

 మీ ప్రణాళికలు సరైనవే అయినా శనిదృష్టి సరిగా లేనందువల్ల విఘ్నాలపాలు కావడమో లేక అసలు అమలు జరగకపోవడమో అవుతుంది. నిరుత్సాహ పడద్దు. శని గ్రహం ప్రతి వ్యక్తికీ చక్కని పాఠాన్ని నేర్పి, దాంతోపాటు నేర్పరితనాన్ని కలిగిస్తుంది. విఘ్నాల పాలౌతున్నా మీరు మీ ప్రయత్నాలని ఆపకుండా చేస్తూనే ఉండడానికి శని ప్రోత్సాహమే కారణమని గమనించండి.

 మీరూ మీ పనీ మీ ఇల్లూ జీవితమూ అంటూ గిరి గీసుకుని గడపాల్సిన వారం ఇది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇతరులకు సలహాలనీ సూచనలనీ ఇవ్వడం ఈ వారంలో మీకు సరిపడని అంశాలు. వైద్య, న్యాయరంగాలకి సంబంధించిన వృత్తుల వారు తగు జాగ్రత్తతో ఉండాలి. లేని పక్షంలో తాత్కాలికంగా పరాజయాన్ని పొందే అవకాశముంది.

 చేసిన పనినే మరోమారు చేయవలసి రావచ్చు. పొరపాటే గనక జరిగి ఉంటే మీ తప్పుని అంగీకరించండి. సమస్య తేలిగ్గా పరిష్కరింప బడుతుంది. వివాహ విషయాలు కానీ ఆస్తి తగాదాలు గాని దాదాపు పరిష్కారమయ్యే స్థితికి రాబోతున్నాయి. ఇలాంటి స్థితిలో పట్టుదలకి పోయి సమస్యను జటిలం చేసుకునేకంటే రాజీకి సిద్ధపడటం మంచిదని గ్రహించండి.

 ఎప్పుడో జరిగిపోయిన వాటిని గురించే ఆలోచిస్తూ ఉంటే శిరోభారమే తప్ప ఒరిగేదంటూ ఏమీ ఉండదనే మీ ఆలోచన ప్రస్తుత సమస్యా పరిష్కారానికి అనుకూలించదని గ్రహించండి. కాలం అనుకూలంగా లేని సందర్భంలో మన ఆలోచన ఎందుకు అమలు జరుగుతుంది? క్రమం తప్పకండా మీరు వాడాల్సిన ఔషధాల్ని వాడుతూ ఉండండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.

 మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం తాత్కాలికంగా సరిలేకపోవచ్చు. ఉద్యోగంలో అవిశ్రాంతంగా శ్రమించవలసి రావచ్చు. శారీరకంగా అలసిపోయే పరిస్థితే ఉద్యోగంలో కనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పండి శరీరారోగ్యం సహకరించదని. బంధుమిత్రుల విషయంలో బహుమతులూ ఉత్సవాలూ మొదలైనవి తారసపడితే కాస్త చూసుకుని ఖర్చు చేయడం మంచిది.

 ఇతరుల మెప్పుకోసం ఎక్కువగా ఖర్చు చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అనవసర ప్రయాణాల వల్ల మీ వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో అజమాయిషీ ఉండక, అది మరో కొత్త సమస్యని తెచ్చిపెట్టవ చ్చు. మీ కోపాన్ని అదుపు చేసుకోని పక్షంలో మీరంటే అభిమానించే ముఖ్యవ్యక్తులు కూడా దూరంగా జరిగిపోవచ్చు. ఆంతరంగికులైనవారిని ఏ మాత్రమూ నిర్లక్ష్యం చేసుకోకండి.

 ఆర్థికంగా బలపడటం కోసం కుటుంబాన్ని మరింత బలోపేతం చేయడం కోసం మీ వంతు ప్రయత్నాన్ని మానకండి. కేవలం మీ జీవిత భాగస్వామి మాత్రమే కుటుంబ విషయంలో బాధ్యులనే ఆలోచనని వీడండి. సంతానం విషయంలో తగిన శ్రద్ధని కలిగి ఉండండి. మీరు మాట్లాడే తీరు ప్రయోజనాత్మకమా? హానికరమా? అని ఓ క్షణం గమనించి వ్యవహరించండి.

 కష్టాలు దాదాపు తీరినట్లే. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలని యథావిధిగా నిర్వహించుకుంటూ సాగిపోండి. కొత్తగా రుణాలని చేయవద్దు. సంతానానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలూ సక్రమంగా జరిగిపోతాయి. హామీ ఉండడం, వాగ్దానాలని చేయడం సాక్షి సంతకాలు పెట్టడం రాజీ కుదర్చడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు
 

మరిన్ని వార్తలు