జీన్స్ మళ్లీ మళ్లీ కొత్తగా!

28 Jan, 2016 22:32 IST|Sakshi
జీన్స్ మళ్లీ మళ్లీ కొత్తగా!

► అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం డెనిమ్. జీన్స్ పేరుతో ప్యాంట్లు, ఓవర్ కోట్స్ ఎన్నో మోడల్స్‌లో మన నట్టింటికి వచ్చాయి. కాలేజీలకు వెళ్లే అబ్బాయిలు, అమ్మాయిల తప్పనిసరి వస్త్ర జాబితాలో జీన్స్ ముందుంటుంది. అంతేకాదు మన్నికలోనూ జీన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్‌లలో ఫస్ట్‌న ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా వేసుకున్న జీన్స్ బోర్ కొట్టినా, లేక కొద్దిగా పాడైనా, ఔట్‌డేటెడ్ అయినా వాటిని తిరిగి ఉపయోగించుకునే సదుపాయమూ ఉంది. అదెలాగో ఈ వారం చూద్దాం..
 
► ప్యాంట్‌ను రెండు భాగాలు చేసి యాప్రాన్‌గా తయారుచేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఛాతి భాగానికి వేడి తగలకుండా కిచెన్‌లో చాలా వరకు కాటన్ యాప్రాన్‌లను ధరిస్తుంటారు. వాటి బదులుగా జీన్స్‌ను ఇలా యాప్రాన్‌గా మార్చేసి వాడుకుంటే ఉపయోగాలు తెలుస్తాయి.
 
► నాలుగైదు రంగు జీన్స్ ప్యాంట్లు విప్పదీసి, డిజైన్‌గా మలచి కుడితే పొడవాటి కుచ్చుల గౌన్ సిద్ధం.
 
► పిల్లల ప్యాంట్లు కొన్నాళ్లయ్యాక పొట్టిగా అయిపోతాయి. అలాంటి వాటిని రెండింటిని తీసుకొని పిల్లలకు గౌన్‌ని తయారుచేయవచ్చు.
 
► జీన్స్‌తో హ్యాండ్ బ్యాగులు, దుస్తుల అలంకరణకు పువ్వులను తయారుచేసుకోవచ్చు. ప్రయత్నించడం మొదలుపెడితే ఇలాంటి ఎన్నో సృజనాత్మక ఆలోచనలు మీకూ రావచ్చు. వాడిన దుస్తులతో కొత్త తరహా డ్రెస్సులను రూపొందిస్తే వాటిని సాక్షి ఫ్యామిలీ చిరునామాకు ఫొటోలు తీసి పంపించండి.
 

మరిన్ని వార్తలు