వచ్చే ఏడాదే అంగారక యాత్ర!

14 Mar, 2018 00:44 IST|Sakshi

అంతరిక్షంలో బోలెడన్ని విజయాలు సాధించామని మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇప్పటివరకూ మనిషి జాబిల్లిని దాటి వెళ్లనే లేదు. అయితే.. ఇంకో ఏడాదిలో ఈ పరిస్థితి మార్చేయడమే కాకుండా.. మనిషిని ఏకంగా అంగారకుడి పైకి పంపేస్తాం అంటున్నారు... స్పేస్‌ ఎక్స్‌ అధినేత, టెస్లా కార్ల తయారీదారు అయిన ఈలాన్‌ మస్క్‌. ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈలాన్‌ మస్క్‌... ‘వచ్చే ఏడాది రెండో సగ భాగంలో అంగారకుడి యాత్ర ఉండవచ్చు’ అన్నారు.

అంతేకాకుండా ఇంకో ఐదేళ్లలోనే ఆ గ్రహంపై మనుషులతో కాలనీ కూడా ఏర్పాటు చేస్తాం అంటున్నారు. ఈ కాలనీలో ఉండే ప్రజలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో అంశాలవారీగా ఓట్లు వేస్తారని చెప్పారాయన. ఈ క్రమంలోనే కృత్రిమమేధ గురించి మాట్లాడుతూ... ఈ టెక్నాలజీ అణుబాంబుల కంటే ప్రమాదకరమైనదని హెచ్చరించారు. ప్రజలందరికీ సమస్యలు తెచ్చిపెట్టే ఈ అంశంపై నిఘా పెట్టేందుకు ఓ వ్యవస్థ కచ్చితంగా ఉండాలని అంటున్నారు.  

మరిన్ని వార్తలు