ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే

4 Feb, 2019 00:55 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది

ప్రియురాలిని చుక్కతో పోల్చడం మామూలే. కానీ విధివశాత్తూ ఆమెకే దూరమైపోతే ఇక నాయకుడు చేయగలిగేదేమిటి? వేలాది నక్షత్రాల్లో ఆమెను వెతుక్కోవడమే. నిరీక్షణ చిత్రంలోని ఈ పాట రాసినవారు ఆచార్య ఆత్రేయ. సంగీతం కూర్చినవారు ఇళయరాజా. పాడినవారు కె.జె.జేసుదాస్‌. 1982లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు బాలు మహేంద్ర. అర్చన, భానుచందర్‌ నటీనటులు.

సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే 
ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
కాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం
ఎన్నాళ్ళకు చేరం తీరందీ నేరం

తానాలే చేశాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్లకు అర్థం
ఇన్నేళ్లుగా వ్యర్థం చట్టందే రాజ్యం
 

మరిన్ని వార్తలు