ఇక ఆయిలీతో నో ప్రాబ్లమ్..

24 Feb, 2016 22:51 IST|Sakshi
ఇక ఆయిలీతో నో ప్రాబ్లమ్..

బ్యూటిప్స్

జిడ్డు చర్మం వారు ఏ కాలాన్నీ ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే ముఖం కడుక్కున్న రెండు నిమిషాలకే చర్మం ఆయిలీగా మారుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా అలాంటి వారు కొన్ని సూచనలు, చిట్కాలు పాటించక తప్పదు.. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి రోజూ నిమ్మరసంతో కానీ నేరుగా నిమ్మకాయ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేసి ముఖాన్ని క్లీన్ చేసుకుంటే జిడ్డుతనం తగ్గుతుంది.
     
ఇంట్లోనే ఫేస్ స్ప్రే తయారు చేసుకొని వాడటం మేలు. ఒక కప్పు నీళ్లలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ఏదైన చిన్న బాటిల్‌లో నింపుకోవాలి. ఇంట్లో ఉన్నా లేక ఆఫీసులో రెండు నిమిషాలకోసారి ముఖంపై చల్లుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటే చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది.
     
ఎండలో నడిచేటప్పుడు కచ్చితంగా గొడుగును వాడటం మర్చిపోకండి. అది వాన నుంచే కాదు మనల్ని ఎండ నుంచీ కాపాడుతుంది. కాబట్టి బయటికి వెళ్లే ముందు బ్యాగ్‌లో గొడుగును తీసుకెళ్లండి.సన్‌స్క్రీన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్‌ను ప్రతి రోజూ చర్మానికి రాసుకోవాలి. అది చెమట కారణంగా అయ్యే డీహైడ్రేషన్‌ను నియంత్రిస్తుంది.

 

మరిన్ని వార్తలు