చక్కెరనే కాదు... ఉప్పునూ తక్కువే వాడండి!

10 May, 2015 23:56 IST|Sakshi
చక్కెరనే కాదు... ఉప్పునూ తక్కువే వాడండి!

డయాబెటిక్ రోగులు చక్కెర పదార్థాలను తక్కువ వాడతారన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఉప్పు వాడకాన్నీ గణనీయంగా తగ్గించాలని జపాన్ పరిశోధకులు. డయాబెటిస్‌తో బాధపడుతూ 40 - 70 మధ్య వయసున్న 1,588 మంది రోగులపై  అధ్యయనం చేశారు. వారంతా రోజుకు సగటున 5.9 గ్రాముల ఉప్పు వాడుతున్నట్లు తేలింది. అయితే రోజుకు 2.8 గ్రాముల ఉప్పు వాడుతున్నవారితో పోలిస్తే 5.9 గ్రాముల ఉప్పు వాడుతున్నవారిలో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం  సక్రమంగా జరగడం లేదని తేలింది.

పైగ వీరందరిలోనూ గుండెజబ్బులు వచ్చే అవకాశాలు రెట్టింపు అయినట్లుగా కూడా ఫలితాలు తేల్చాయి. అందుకే డయాబెటిస్ రోగులు చక్కెరతో పాటు, ఉప్పు వాడకం విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని పరిశోధనవేత్తలు డయాబెటిస్ బాధితలకు సూచన ఇస్తున్నారు.

>
మరిన్ని వార్తలు