నూడుల్స్

19 Nov, 2015 22:46 IST|Sakshi
నూడుల్స్

 తిండి గోల

 ప్రపంచ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు అతి సాధారణంగా తీసుకునే ఆహారం నూడుల్స్. దీని జన్మస్థలం అరేబియా ప్రాంతం అని ఎక్కువమంది నమ్మకం. ఆ తర్వాత చైనాలో దీని ఉనికి నాలుగువేల ఏళ్ల నుంచి ఉందని పరిశోధకులు అంటున్నారు. బౌద్ధ సన్యాసుల ద్వారా ఇవి చైనా నుంచి జపాన్, కొరియాలకు చేరి ఉంటాయని ఒక పరిశీలన. ఆ తర్వాత యూరప్‌లో ఇవి ప్రాచుర్యం పొందాయి.

‘నూడుల్’ అనే మాట జర్మన్ భాష నుంచి వచ్చిందట. ఇప్పుడు మనం చూస్తున్న ఇన్‌స్టాంట్ నూడుల్స్‌ను కనిపెట్టిన ఘనత మాత్రం జపనీయులదే. 1958లో మమొఫుకో అండు అనే వ్యక్తి ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తయారు చేసి ఇళ్లల్లో ఎక్కువ రోజులు వీటిని నిల్వ చేసుకోవచ్చని నిరూపించాడు. ఆ తర్వాత ఇవి అతి పెద్ద వ్యాపారవస్తువులయ్యాయి. చైనా, కొరియా, జపాన్‌లలో నాన్‌వెజ్ ఇన్‌స్టంట్ నూడుల్స్ విస్తారంగా దొరుకుతాయి. అంటే గుడ్డు, చికెన్ ఇత్యాది మాంసపదార్థాలను కలిపి తయారు చేస్తారు.
 
 

మరిన్ని వార్తలు