కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం!

22 Sep, 2017 21:05 IST|Sakshi
కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం!

గుడ్‌ ఫుడ్‌

కాలక్షేపం బఠాణీలు అంటూ వాటిని తింటుంటాం. కానీ బఠాణీల వల్ల ఒనగూరే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని
ఇవి...

బఠాణీల్లో పీచు పాళ్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. పీచు, ప్రోటీన్లు చక్కెరలను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. అందుకే డయాబెటిస్‌ రోగులకు బఠాణీలు చాలా మంచిది   
 
బఠాణీల్లో ఉండే పీచు పదార్థం జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంతో పాటు మంచి జీర్ణశక్తికి దోహదం చేస్తుంది

బఠాణీల్లో ఫోలిక్‌ యాసిడ్‌ పాళ్లు ఎక్కువ. కాబోయే తల్లుకు ఫోలిక్‌ యాసిడ్‌ చాలా మేలు చేస్తుంది.

అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునేవారికి, కాబోయే తల్లులకు బఠాణీలు మేలు చేస్తాయి

బఠాణీల్లో ఉండే విటమిన్‌ బి 6, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి పోషకాలు ఉన్నందున అవి గాయాల తాలూకు ఇన్‌ఫ్లమేషన్‌ను (ఎర్రబారడం, నొప్పి, మంట) త్వరగా తగ్గిస్తాయి.

ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువ కాబట్టి అవి గాయాలను త్వరగా మాన్పుతాయి

బఠాణీలు చర్మానికి నిగారింపును కూడా ఇస్తాయి

బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. అందుకే అవి ఎన్నోరకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంటాయి. అంతేగాక వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనర్థాలను తగ్గిస్తాయి.

ఫ్రీ–రాడికల్స్‌ను హరించే గుణం వల్ల అవి పెరిగే వయసును కనిపించనివ్వకుండా చేస్తాయి. చర్మంపై ముడుతలు రాకుండా చూస్తాయి

ఆస్టియోపోరోసిస్‌ను అరికట్టే గుణం బఠాణీలకు ఉంది .

బఠాణీలలోని విటమిన్‌–కెతో పాటు ఉండే ఇతర పోషకాలు వయసు పెరిగాక మతిమరపును తెచ్చే అలై్జమర్స్‌ డిసీజ్‌ను అరికడతాయి. 

మరిన్ని వార్తలు