తియ్యటి కబురు

19 Aug, 2018 23:59 IST|Sakshi
సాహిత్య మరమరాలు

1960లో విడుదలైన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి ఆత్రేయ రచయిత. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్‌.వరలక్ష్మి, శాంతకుమారి నటించిన ఈ మూడు గంటల సినిమాకు పి.పుల్లయ్య దర్శకుడు. ప్రేక్షకులు దేవుడిలా దండం పెట్టేంత ఇమేజ్‌ ఎన్టీఆర్‌కు ఇచ్చింది ఈ చిత్రం. అందులో ఒక చోట ‘కబురు’ అనే మాట వస్తుంది. ఖబర్‌ అనే ఉర్దూ మాట నుంచి ఈ కబురు అనే మాట పుట్టింది. ఈ ‘పొరపాటు’కు ఆత్రేయ నొచ్చుకున్నారు. ‘అయ్యో, పౌరాణిక చిత్రంలో కబురు అనే మాట వాడానే’ అని తన అసమర్థతకు విలపించారు. ఇదే సంగతిని ఓసారి గీత రచయిత, కథకుడు అయిన మల్లాది రామకృష్ణశాస్త్రితో చెప్పుకుని బాధపడ్డారు. ‘వేంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లాడాడు కదా, అంటే ఆ కాలంలో ఉరుదూ ఉన్నట్టే, అప్పుడు కబురు అనే మాట తప్పు ఎలా అవుతుంది?’ అని సాంత్వన వచనాలు పలికారు రామకృష్ణశాస్త్రి.  అప్పుడుగానీ ఆత్రేయ మనసు కుదుటపడలేదు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాఫీ కావాలా.? కాస్త జాగ్రత్త !

ఫార్‌... ఇన్‌ కిచెన్‌

ఉపవాసంతో ఆయుష్షు పెరుగుతుంది

పేగు బ్యాక్టీరియా కరెంటు పుట్టిస్తుంది

పోషకాహార లేమితో కేన్సర్‌ ముప్పు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సల్మాన్‌ సినిమా అయితే రూ. 500 కోట్లు..’

రానా చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్‌

ప్రతినాయక పాత్రలకు సిద్ధం : బాలకృష్ణ

అక్టోబ‌ర్ 5న ‘ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌’

రాజమౌళి మల్టీస్టారర్‌పై మరో అప్‌డేట్‌

2.ఓ టీంకు డెడ్‌లైన్‌..!