అక్టోబర్ 26 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

25 Oct, 2015 23:08 IST|Sakshi
అక్టోబర్ 26 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
మనో (సింగర్), అసిన్ (నటి), అమలాపాల్ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. పుట్టిన తేదీ 26. ఇది శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరిపై శని ప్రభావం బలంగా ఉంటుంది. ఫలితంగా ఈ సంవత్సరం వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్  ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐ.ఎ.ఎస్‌లు, ఐపీఎస్‌లు తదితర అధికారులకు పదోన్నతి ప్రాప్తిస్తుంది. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి.

క్రమశిక్షణ, న్యాయం, ధర్మం, సమానత్వం అనే గుణాలను కలిగి ఉండటం వల్ల సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. పిల్లలకు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. అయితే బీపీ, హృద్రోగాలు తలెత్తే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు.
 
సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం, వృద్ధులను ఆదరించడం, పిల్లులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్త్రో న్యూమరాలజిస్ట్
 

మరిన్ని వార్తలు