డిసెంబర్ 16న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

15 Dec, 2015 22:35 IST|Sakshi
డిసెంబర్ 16న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
తోట తరణి (ఆర్ట్ డైరక్టర్), కుయిలీ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంబంధమైనది కాబట్టి కుజుని ప్రభావం వల్ల వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలు, దేహదారుఢ్యం కలిగి ఉండటం వల్ల యూనిఫారం ధరించే ఉద్యోగాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆస్తులు సమకూర్చుకుంటారు. 9 అనేది సంపూర్ణతకి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపించాలనే కోరిక తీరుతుంది. రియల్ ఎస్టేట్‌లోనూ, మైన్స్, భూమికి సంబంధించిన వ్యవహారాలలోనూ విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఈరోజు పుట్టిన తేదీ 16. అంటే 7. ఇది కేతు సంబంధమైనది కాబట్టి వీరు ఈ సంవత్సరం ఆధ్యాత్మికతవైపు దృష్టి పెడతారు. దూరపు బంధువులను, స్నేహితులను కలుస్తారు. విదేశీ విద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

లక్కీ నంబర్స్: 1,2,3,6,7,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాలు.
 
సూచనలు
: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; కేతు గ్రహ జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం,  వృద్ధులను, వికలాంగులను ఆదరించడం, మాటలలో సంయమనం పాటించడం, భూమిని, ఇంటిని అమ్మే ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. అలాగే రక్తదానం చేయడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం కూడా మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా