డిసెంబర్ 17న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

16 Dec, 2015 23:46 IST|Sakshi
డిసెంబర్ 17న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
జాన్ అబ్రహాం (బాలీవుడ్ హీరో)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది వీరు పుట్టిన తేదీ 17 శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు.

కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఉత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, వైట్, సిల్వర్, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, రోజూ వెన్నెలలో కాసేపు విహరించడం, ఇంటికొచ్చిన వారికి ప్రేమగా పాయసం తినిపించడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

మరిన్ని వార్తలు