డిసెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

8 Dec, 2015 02:09 IST|Sakshi
డిసెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ధర్మేంద్ర (నటుడు), షర్మిలా ఠాగూర్ (నటి

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంబంధ సంఖ్య కావడం వల్ల స్వతస్సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటారు.

అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.

సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. లక్కీ నంబర్స్: 1,3, 5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, సిల్వర్, గోల్డెన్.

సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, తండ్రిని, తత్సమానులను గౌరవించడం, తోబుట్టువులను ఆదరించడం, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు,శునకాలకు ఆహారం పెట్టడం, మంచిది
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు