జూలై 25 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

24 Jul, 2015 22:54 IST|Sakshi
జూలై 25 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కైకాల సత్యనారాయణ (నటుడు), రాగేశ్వరి (గాయని, నటి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4.   ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య. రాహువు ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి, కంప్యూటర్ పరిజ్ఞానానికీ చిహ్నం. అందువల్ల అసాధ్యమనుకున్న పనులు కూడా సులువుగా పూర్తి చేయగలరు. పరిశోధన రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు, ఆదాయ వృద్ధి ఉంటుంది. మీ పుట్టిన రోజు 25. ఇది చంద్ర, బుధులకు సంబంధించినది  కాబట్టి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి కలిగి ఉండి, మంచి అదృష్టాన్నిస్తుంది. ఆధ్యాత్మికంగా పట్టు సాధిస్తారు. జీవితంలో ఉన్నత స్థితిని పొందే అవకాశాలు కలిసి వస్తాయి. దృఢమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

ఇల్లు, ఆస్తులు సమకూర్చుకోవాలన్న కోరిక, విదేశాలలో ప్రయాణించాలనే కల నెరవేరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతంలో వృద్ధి ఉంటాయి. లక్కీ నంబర్స్: 1,2,4,6,8; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, పర్పుల్, వయొలెట్, ఎల్లో, బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, గురు, శుక్రవారాలు; లక్కీ పిరియడ్: జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్; సూచనలు: ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అల్సర్స్, జీర్ణక్రియకు సంబంధించిన జాగ్రత్త అవసరం. రాహుకేతు జపం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అనాథలకు అన్నదానం, వికలాంగులను ఆదరించడం
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

మరిన్ని వార్తలు