నవంబర్ 16న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

15 Nov, 2015 22:54 IST|Sakshi
నవంబర్ 16న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
మీనాక్షీ శేషాద్రి (నటి), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్ కోచ్)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శని సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరిగినప్పటికీ ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయవాద వృత్తిలోని వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు, వైద్యవిద్యార్థులు, వైద్యులు రాణిస్తారు. వీరు పుట్టిన తేదీ 16. ఇది కేతు సంఖ్య కావడం వల్ల వీరికి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులను, స్నేహితులను కలుస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,3,6,7,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి రుద్రాభిషేకం, కేతు గ్రహ జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, వృద్ధులను, వికలాంగులను ఆదరించడం, మాటలలో సంయమనం పాటించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

మరిన్ని వార్తలు