అక్టోబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

30 Oct, 2015 00:13 IST|Sakshi
అక్టోబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
అభిజిత్ ఛట్టాచార్య (గాయకుడు), దలీప్ తాహిల్ (నటుడు)

 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించింది. వీరి పుట్టిన తేదీ 30. ఇది కూడా బృహస్పతికి సంబంధించిన సంఖ్యే కాబట్టి వీరిపై బృహస్పతి బలమైన ప్రభావం వల్ల ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. జన్మతః నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి మేధావిగా గుర్తింపబడతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు.

రచయితలు, వక్తలు, సంగీత కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. అయితే న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు అనుకూలించకపోవచ్చు. కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. ఆపేసిన చదువును కొనసాగిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్, శాండల్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 

మరిన్ని వార్తలు