సెప్టెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

7 Sep, 2015 23:10 IST|Sakshi
సెప్టెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు


ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఆశా భోంస్లే (గాయని), మాధవపెద్ది సురేష్ (సంగీత దర్శకుడు)
 

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. దీని ప్రభావం వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల ప్రాపంచిక జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవితం పైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. వేదపండితులు, స్వామీజీలు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఈ సంవత్సరం ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతారు.  వీలయినంత వరకు ప్రశాంతంగా ఉంటూ, యోగ, ధ్యానాలలో గడపడం మంచిది. యూనిఫారం ధరించే ఉద్యోగులకు, జ్యోతిష్యులకు, వేదపండితులకు, పురోహితులకు మంచి గుర్తింపు, గౌరవ సన్మానాలు జరుగుతాయి. 8వ తేదీన పుట్టిన వారు తమను ఎవరూ గుర్తించడం లేదన్న ఆందోళన, నైరాశ్యంలో ఉంటారు.

అది తప్పు అని రుజువు చేస్తూ ఈ సంవత్సరం వారికి మంచి ఆత్మస్థైర్యం, సానుకూల భావనలు అలవడతాయి. వివాహం, సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించేవారి ఆశలు ఫలిస్తాయి. గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు, ఛాతీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే నివారణ మార్గాలను అన్వేషించడం మంచిది.  లక్కీ నంబర్స్: 2,5,6,8; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్. సూచనలు: నవగ్రహారాధన, కాకులకు తీపిపదార్థాలు పెట్టడం, ఆవులకు, కోతులకు ఆహారం తినిపించడం, వృద్ధాశ్రమాలలో శ్రమదానం లేదా సాయం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

మరిన్ని వార్తలు