పొగ బారిన ప్రతి ఐదు సెకన్లకు ఒకరు..

5 Jun, 2018 19:02 IST|Sakshi

లండన్‌ : పొగతాగడం ద్వారా ప్రతి ఐదు సెకన్లకు ఓ వ్యక్తి మరణిస్తున్నాడని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలతో 2016 నుంచి ఇప్పటివరకూ 30 లక్షల మంది మరణించారని ఇటీవల వెల్లడైన గణాంకాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో ఇవి ఆరు శాతం కావడం గమనార్హం.2022 నాటికి గుండె జబ్బులు, క్యాన్సర్‌ల తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతో అత్యధిక మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు.

శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, ప్రఖ్యాత పల్మనాలజిస్ట్‌ సయ్యద్‌ జఫర్‌యాబ్‌ హుస్సేన్‌ నిర్వహించిన ఓ సెమినార్‌లో ఈ దిగ్భ్రాంతికర గణాంకాలు వెలుగుచూశాయి. ఉగ్రవాద ముప్పుతో పోలిస్తే పొగతాగడం వల్లే అత్యధిక జనాభా మృత్యువాతన పడుతున్నదని, రోగులకు పొగతాగడం ఎంత ప్రమాదకరమో వైద్యులు విస్పష్టంగా తెలియచేయాలని కోరారు. యువత, మహిళలు సైతం పొగతాగడం అలవాటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు.

ఈ సిగరెట్స్‌ కూడా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రపంచ జనాభాలో ఐదో వంతు మంది దాదాపు వంద కోట్ల ప్రజలు సిగరెట్లు తాగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు