ఉల్లి రైతుకు ఊరటనిచ్చే యంత్రం

6 Nov, 2018 05:14 IST|Sakshi

ఉల్లి పాయలను పీకిన తర్వాత కాడను కొంత మేరకు కోసి పొలంలో 3–7 రోజులు ఎండబెడతారు. ఎండిన తర్వాత ఉల్లిపాయలపై గుప్పెడు ఎత్తున ఉండే పిలకను కత్తితో కోసి, గ్రేడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పనిని సాధారణంగా మహిళా కూలీలతో చేయిస్తుంటారు. ఇది చాలా శ్రమతో, ఖర్చుతో కూడిన పని. ఈ సమస్య పరిష్కారానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ. కరోలిన్‌ రతినకుమారి ఒక యంత్రాన్ని రూపొందించారు.

ఆనియన్‌ డి–టాప్పింగ్‌ మెషీన్‌లో ఎండిన ఉల్లిపాయలు వేస్తే.. ఉల్లిపాయల నుంచి పిలకలను కత్తిరించి, వీటిని వేర్వేరుగా బయటకు పంపుతుంది. 3 కె.డబ్లు్య., 3 ఫేజ్‌ విద్యుత్‌ మోటార్‌తో నడుస్తుంది. గంటకు టన్ను ఉల్లిపాయలపై పిలకలు కత్తిరిస్తుంది. దీని ధర రూ. 4 లక్షలు. ఉల్లిని ఎక్కువగా సాగు చేసే ప్రాంతాల్లో రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. వివరాలకు.. డాక్టర్‌ ఎ. కరోలిన్‌ రతినకుమారి, ముఖ్య శాస్త్రవేత్త, ఐఐహెచ్‌ఆర్, బెంగళూరు. మొబైల్‌ – 94835 19724
carolin@iihr.res.in

మరిన్ని వార్తలు