అప్పుడే అసలైన ఆత్మ సంతృప్తి

18 May, 2017 00:11 IST|Sakshi
అప్పుడే అసలైన ఆత్మ సంతృప్తి

ఆత్మీయం

జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, మనిషి జీవితం సంతోషమయం కావాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ ఏదో ఒక కొత్త కోరిక పుట్టటం, ఎన్ని వస్తువులు, ఆభరణాలు ఉన్నా మన దగ్గర లేనిది ఇంకేదో పొందడానికి ప్రయత్నించటం, విశ్రాంతి, విసుగూ లేకుండా ఆ ఝంఝాటంలో పడి కొట్టుకొనిపోవటం మనిషి లక్షణం.

బిలియనీర్‌ నుంచి బిచ్చగాడి వరకు దీనికి అతీతులు కారు. కోరికలే లేని మనిషి ఉండడు, కానీ కోరికలను అదుపు చేసుకోవడం సాధ్యమే. లేనివాటి కోసం పాకులాడకుండా ఉన్నవాటిని ఇష్టంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. స్వశక్తితో తమను తాము ఉన్నతంగా మలుచుకోవాలి. చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయాలి. తీసుకోవడంలోకన్నా ఇవ్వడంలోనే అసలైన ఆనందం, తృప్తి ఉన్నాయని తెలుసుకున్నారు కనుకనే మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ వ్యాపార దిగ్గజం వారెన్‌ బఫెట్‌ వంటివారు ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

మరిన్ని వార్తలు