మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా

26 Feb, 2019 06:05 IST|Sakshi

సేంద్రియ రైతులతో నేరుగా సంబంధాలు కలిగిన ఏకలవ్య ఫౌండేషన్, గ్రామభారతి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, భారతీయ కిసాన్‌ సంఘ్‌ కలిసి గో ఆధారిత రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో మార్చి 1, 2, 3 తేదీల్లో సేంద్రియ ఉత్పత్తుల మేళాను నిర్వహిస్తుండటం విశేషం. హైటెక్‌ సిటీలోని శిల్పారామం నైట్‌ బజార్‌లో జరగనున్న ఈ మేళాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం, సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ., ఎన్‌.ఐ.ఎన్‌. సంస్థలు కూడా ఈ మేళాలో పాలుపంచుకుంటున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేంద్రియ రైతులు, దుకాణదారులు తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్మకానికి పెడతారు. సేంద్రియ ఆహారోత్పత్తులతోపాటు 200 రకాల ఔషధ మొక్కలు, హెర్బల్‌ ఉత్పత్తులు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయని గో ఆధారిత రైతు మిత్ర సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. మార్చి 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం ప్రారంభమవుతుంది. మ. 3 గం. కు కోత అనంతరం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ. నిపుణులతో సదస్సు, సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటాయి. 2న సా. 3 గం.కు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు, జాతీయ పోషకాహార సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఆహార సదస్సు ఉంటుంది.

3న సా. 3 గం.కు జరిగే పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 4 గం.కు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్‌ వలి ప్రసంగం, చర్చాగోష్టి ఉంటాయి. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు ఉచితంగా టేబుల్‌ స్పేస్‌ పొందే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534.

3న బసంపల్లిలో గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ
అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో మార్చి 3(ప్రతి నెలా మొదటి ఆదివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై సీనియర్‌ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా తమపేర్లు నమోదు చేయించుకోవాలి. రుసుము రూ. 100 (భోజనం సహా). వివరాలకు.. 94407 46074, 96636 67934

3న కొర్నెపాడులో బొప్పాయి, కూరగాయల సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయవిధానంలో బొప్పాయి, కూరగాయల సాగుపై మార్చి 3(ఆదివారం)న సీనియర్‌ రైతులు శరత్‌బాబు (ప్రకాశం జిల్లా), శివనాగమల్లేశ్వరరావు (గుంటూరుజిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255.

1న డ్రయ్యర్‌తో మామిడి ఆమ్‌చుర్, తాండ్ర తయారీపై ఉచిత శిక్షణ
మామిడి కాయలతో ఒరుగులు (స్లైసెస్‌), మామిడి కాయల పొడి (ఆమ్‌చూర్‌), మామిడి తాండ్రలను తక్కువ ఖర్చుతో త్వరగా ఎండబెట్టే డ్రయ్యర్‌ సాంకేతికత–నిర్వహణపై మార్చి 1 (శుక్రవారం)న ఉ. 10 గం.ల నుంచి గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకుడు ఎల్‌. శ్రీనివాసరావు తెలిపారు. ఒక హెచ్‌.పి. విద్యుత్తు లేదా వంట చెరకుతో ఈ డ్రయ్యర్‌ నడుస్తుంది. వివరాలకు.. 99123 47711.

మరిన్ని వార్తలు