ధనియాలకు తల్లి కొత్తిమీర...

30 Oct, 2015 00:22 IST|Sakshi
ధనియాలకు తల్లి కొత్తిమీర...

తిండి గోల

ధనియాలను రోజువారీ వంటల్లో వాడితే ఆరోగ్యానికి అదనంగా ధనం ఖర్చుపెట్టాల్సిన అవసరం పడదు అని చెప్పడానికేమో మన పూర్వీకులు వీటికా పేరు పెట్టి ఉంటారు. 14వ శతాబ్దంలో కొరియండర్ అని ఆంగ్లేయులు నామకరణం చేసిన కొత్తిమీర గడ్డిభూములలో విస్తారంగా ఎదిగేది. ఈ మొక్క గింజలే ధనియాలు. దాదాపు 5 వందల ఏళ్ల క్రితం ఉత్తర అమెరికాలో స్థిరపడిన బ్రిటిషర్లు కొత్తిమీర సాగు చేసి ధనియాల రుచిని అక్కడి వారికి పరిచయం చేశారు. అయితే, కొత్తిమీర మూలాలు క్రీస్తు పూర్వమే గ్రీసు దేశంలోనే ఉన్నాయని, సాగుబడిలో అటు తర్వాత ఇవి ప్రపంచమంతటా విస్తరించాయని చరిత్రకారులు చెబుతున్నారు.

వివాదాలు ఎలా ఉన్నా కొత్తిమీర ఆకులు, కొత్తిమీర గింజలు వంటలకు అమోఘమైన రుచిని తీసుకువస్తాయి. ప్రపంచంలో భారత దేశ మసాలా వంటకాలు, థాయ్ వంటకాలలో కొత్తిమీర, ధనియాలను విరివిగా ఉపయోగిస్తారు. అజీర్తిని నివారించడంలో అమోఘంగా పనిచేసే ధనియాలు, కొత్తిమీరలో పీచు, కాల్షియం, ఇనుము, మెగ్నిషియం పాళ్లు ఎక్కువే. కొత్తిమీర ఆకులు, పువ్వుల వాసన పీలిస్తే మైగ్రెయిన్ వంటి తలనొప్పి బాధల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
 
 

మరిన్ని వార్తలు