ఆ వైరస్‌తో మనకు మేలే! 

4 Jul, 2018 01:07 IST|Sakshi

వయసుతో పాటు మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతూంటుంది. వృద్ధులకు  వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు టక్కున వచ్చేందుకు కారణం ఇదే. ఈ సమస్యను అధిగమించేందుకు అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఓ విచిత్రమైన ఫలితాలిచ్చాయి. వ్యాధులకు కారణమవుతాయని మనం ఇప్పటివరకూ భయపడుతూన్న వైరస్‌లలోనే ఒకటి మన రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయగలదని వీరు గుర్తించారు. సైటో మెగలో వైరస్‌ అని పిలుస్తున్న ఈ వైరస్‌ సగం మంది మనుషులకు చిన్నప్పుడే సోకుతుంది.

చికిత్స ఏదీ లేకపోవడం వల్ల పెద్దవాళ్లలోనూ కనిపిస్తూంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి ఈ వైరస్‌తో పోరాడుతూ ఉంటుందని, ఫలితంగా ఇతర వైరస్‌లకు త్వరగా లొంగిపోతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే సైటో మెగలో వైరస్‌ను ఎలుకలకు ఎక్కించి, అదే సమయంలో లిస్టీరియా వైరస్‌ను చేర్చినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ మరింత సమర్థంగా లిస్టీరియాను ఎదుర్కొందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్‌ స్మితీ తెలిపారు. మరిన్ని పరిశోధనలు చేసి∙చూడగా, సైటో మెగలో వైరస్‌ రోగ నిరోధక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు