పద్మావతి ఓకే ప్యాడ్‌మ్యాన్‌ నాట్‌ ఓకే

12 Feb, 2018 00:49 IST|Sakshi

‘ప్యాడ్‌మ్యాన్‌’ మూవీ మొన్న ఫ్రైడే ప్రపంచమంతా విడుదలైంది. ఒక్క పాకిస్థాన్‌లో తప్ప! రుతుస్రావ పారిశుధ్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని దర్శకుడు ఆర్‌.బల్కీ తీసిన ఈ చిత్రం తమ సంస్కృతికి, సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా ఉందని భావించిన పాక్‌ సెన్సార్‌ బోర్డు... విడుదలకు అనుమతిని తిరస్కరించడంతో, అక్కడి ప్రభుత్వం కూడా ఈ సినిమాపై నిషేధం విధించింది.

‘‘గోప్యమైన విషయాలను బాహాటంగా చర్చించడం, చర్చకు అవకాశం కల్పించడం అన్నవి ఈ దేశపు మనోభావాలను భంగపరిచేవి కనుక ‘ప్యాడ్‌మ్యాన్‌’కు క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేకపోతున్నాం’’ అని అక్కడి పంజాబ్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు కూడా ప్రకటించింది. పాకిస్థాన్‌ ఎంతగానో అభిమానించే మన అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌.. ప్యాడ్‌మ్యాన్‌ చిత్రంలో ఉన్నప్పటికీ, ప్యాడ్‌మ్యాన్‌ థీమ్‌ను మాత్రం ఆ దేశం మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతోంది.

భారత్‌లోని సగటు మహిళా ప్రేక్షకులు కూడా ప్యాడ్‌మ్యాన్‌ చిత్రాన్ని చూసేందుకు బిడియపడకుండా రాలేకపోతున్నారని సమీక్షలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. భారత్‌లో ఆటంకాలను ఎదుర్కొన్న ‘పద్మావతి’ చిత్రానికి పాక్‌ ఒక్క కట్‌ కూడా లేకుండా ఓకే చెప్పింది. ఒక్క కట్‌ కూడా లేకుండా భారత్‌లో విడుదలైన ‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రం పాక్‌లో రిలీజ్‌ కాలేకపోయింది. ఎవరి మనోభావాలు వారివి. వాటిని గౌరవించడం మానవ సంప్రదాయం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు