పల్లె పిలిచింది..!

2 Apr, 2019 06:00 IST|Sakshi
ఆవులు, పంటలతో సత్యజిత్, అంజిక హంగె సోదరులు

‘‘దృఢమైన సంకల్పంతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తుంటే అది విజయవంతం కావడానికి ప్రకృతి కూడా ‘కుట్ర’ పన్నుతుంది’’ అంటాడు   సుప్రసిద్ధ రచయిత పాలో కోయిలో. కార్పొరేట్‌ ఉద్యోగాలు వదలి సేంద్రియ సేద్యం చేపట్టి.. అద్భుత ఫలితాలు సాధిస్తున్న సత్యజిత్, అజింక హంగె సోదరుల జీవితం ఈ సూక్తిని జ్ఞప్తికి తెస్తోంది. పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వీరిద్దరూ కష్టపడి ఎంబీయే చదువుకొని కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. హోదాకు, డబ్బుకు కొదవ లేకున్నా మనసు లోతుల్లో తెలియని వెలితి, అసంతృప్తి. తమకు ఆనందాన్నిచ్చే జీవితం ఇది కాదని అర్థమైంది. వీకెండ్స్‌లో పల్లెకు, పొలానికి వెళ్లినప్పుడు కలిగే ఆనందం తర్వాత చప్పున ఇగిరిపోతోంది. అంతరంగంలో ప్రతిధ్వనిస్తున్న పల్లె పిలుపును మనసొగ్గి ఆలకించారు. పెద్ద జీతాలతో కూడిన ఉద్యోగాలను సైతం త్యజించి పల్లెబాట పట్టారు. కోటి ఆశలతో స్వగ్రామానికి చేరారు. గిర్‌ ఆవులు కొన్నారు. తొలుత కొద్దిపాటి భూమిలోనే సేంద్రియ సేద్యానికి శ్రీకారం చుట్టారు. రసాయనిక అవశేషాల్లేని అమృతాహారం పండించడమే కాదు.. ఏటా రూ. 3 కోట్ల టర్నోవర్‌తో భళా అనిపించుకుంటున్నారు.

సత్యజిత్, అజింక హంగె సోదరులు పుట్టింది భోదని అనే పల్లెటూరులో. రైతు కుటుంబం. పుణె నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో భోదని ఉంటుంది. వాళ్ల తల్లిదండ్రులు మట్టిమనుషులు. కాయకష్టం చేసి వారిని పుణె నగరంలోని ఆంగ్లో–ఇండియన్‌ బోర్డింగ్‌ స్కూల్లో చదివించారు. వారి జీవితం గొప్పగా ఉండాలని ఎంబీయే చదివించారు. సత్యజిత్, అజింక బాగా చదువుకొని సిటీబ్యాంక్, డీబీఎస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌ఎస్‌బీసీ వంటి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్లు గడిచాయి. ఉద్యోగాల్లో మంచి జీతభత్యాలు అందుకుంటున్నారు. అంతాబాగానే ఉన్నా తెలియని అసంతృప్తి, వెలితి మనసు పొరల్లో రొద పెడుతూనే ఉన్నాయి. వారాంతంలో పల్లెకు వెళ్తే ఉండే హాయి నగరంలో ఉన్పప్పుడు దొరకడం లేదని గ్రహించారు. తెగువ చూపారు.

ఉద్యోగాలు వదిలేశారు. నేను పడిన కష్టం పిల్లలకు ఉండకూడదనుకున్న తండ్రి తల్లడిల్లిపోయాడు. సరైన ఆదాయం దొరకని వ్యవసాయంలోకి రావడం మంచి నిర్ణయం కాదన్నాడు. అయినా, సత్యజిత్, అజింక సోదరులు జంకలేదు. మట్టి మీద కోటి ఆశలు పెట్టుకొని మనోబలంతో ముందడుగేశారు. తొలుత కొద్దిపాటి భూమిలోనే సేంద్రియ సేద్యం ప్రారంభించారు.తొలి దశలో ఏటా రూ. 2 లక్షల అమ్మకాలు జరిగేవి. అష్టకష్టాలూ పడ్డారు. అయినా మడమ తిప్పలేదు. క్రమంగా పరిస్థితులు అనుకూలించాయి. సోదరులు ప్రస్తుతం 20 ఎకరాల్లో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. ఏటా రూ. 3 కోట్లకు పైగా టర్నోవర్‌ సాధించే దశకు ఎదిగారు.

చెరకు బదులు పండ్ల తోటలు...
పశ్చిమ మహారాష్ట్రలో చాలా మంది రైతులు కరువు కాలంలో కూడా చెరకు అలవాటుగా చెరకు పంటను రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేస్తుంటారు. సత్యజిత్, అజింక సోదరులు పంటల సరళిని సాగు పద్ధతిని కూడా మార్చారు. అదే వారి విజయరహస్యం. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలను సాగు చేయనారంభించారు. చెరకుతో పోల్చితే ఈ తోటలకు నీటి అవసరం చాలా తక్కువ. తోటల సాగుకు భూమిని కూడా పెద్దగా దున్నాల్సిన అవసరం లేదు. సేంద్రియ పండ్లు ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంటాయి. ‘రసాయనిక ఎరువులు, పురుగుమందులు భూముల ఉత్పాదక శక్తిని నశింపజేస్తున్నాయని, ఆహారోత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తున్న విషయం గుర్తించాం. గ్రామంలో అనుభవజ్ఞులైన వ్యవసాయ కూలీలు, రిటైరైన రైతులతో మాట్లాడి.. ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకున్న పద్ధతులను కలగలిపి.. ఆవు పేడ, మూత్రంతో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాం..’ అని సత్యజిత్‌ అన్నారు.

రెండు ఎకరాల భూమిలో దేశీ రకం దానిమ్మ, దేశీ రకం కందులను తొలుత సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతోపాటు 20 దేశవాళీ గిర్‌ ఆవులను కొనుగోలు చేశారు. తొలి నాలుగేళ్లు నష్టాలే ఎదురొచ్చాయి.
‘అది చాలా కష్టకాలం. ఉద్యోగాలు వదిలేసి వచ్చి వ్యవసాయంలో దిగాం. టన్ను దేశీ బొప్పాయిలు పండించాం. అదే మా తొలి చెప్పుకోదగ్గ సేంద్రియ దిగుబడి. నోట్లో వేసుకుంటే అమృతంలాగా ఉంది రుచి. లోకల్‌ మార్కెట్‌కు తీసుకెళ్తే కిలో రూ. 4కు కొన్నారు. అంతా దళారుల రాజ్యం. ఇక ఇలా లాభం లేదని.. ఒక టెంపో వాహనంలో కొన్ని బొప్పాయిలు వేసుకొని వంతెనల వద్ద ఉండే తోపుడు బండ్ల వ్యాపారుల దగ్గరకు తీసుకెళ్లాం. మా దగ్గర నుంచి కిలో రూ. 20కి కొనడానికి వాళ్లు ముందుకు రాలేదు. అందుకని, వాళ్లకు ఉచితంగానే ఇచ్చాం. వాటిని రుచి చూసిన వినియోగదారులు తిరిగి వచ్చి.. అవే కావాలని అడగడం మొదలు పెట్టారు. పంటను లాభదాయకంగా అమ్మటం అలా మొదలు పెట్టాం..’ అన్నారు సత్యజిత్‌.

ఇలా 8 నెలలు తోపుడు బండ్ల వారి ద్వారా పండ్ల అమ్మకం సాగించిన తర్వాత.. ఓ మాల్‌ యజమాని అనుకోకుండా ఈ పండ్లను రుచి చూసి సత్యజిత్, అంజిక్యలకు కబురు పెట్టాడు. మాల్‌లో ఒక ర్యాక్‌ను ఉచితంగా ఇచ్చాడు. రసాయనాలతో పండించిన ఇతర ర్యాక్‌లలో పండ్లు అలాగే ఉండేవి. వీళ్ల ర్యాక్‌ వెంటనే ఖాళీ అయిపోయేది. తదనంతరం సత్యజిత్, అంజిక్య  దాదార్‌లో రైతు మార్కెట్‌ను ప్రారంభించారు. ఇవ్వాళ వీరి సేంద్రియ పండ్లు కొంటున్న వారిలో  వ్యాపారవేత్తలు, బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఉన్నారు!

మామిడి పండుపై ఈ పోగులు ఎందుకొస్తాయి?
మామిడి పండ్లలో అప్పుడప్పుడూ ఈ ఫొటోలో మాదిరిగా తొక్క తీయగానే వేర్ల మాదిరిగా పోగులు అల్లుకొని కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య ఉన్న మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు. కానీ, చూపులకు బాగుండదు కాబట్టి తినడానికి వినియోగదారులు పెద్దగా ఇష్టపడరు. ఆ కాయలు పెద్దగా ధర పలకవు. రైతులు, వ్యాపారులు ఏటా భారీగానే నష్టపోతుంటారు.
ఈ పోగులు అల్లుకున్న చోట మామిడి గుజ్జు కొంచెం ఎర్రగా మారుతూ ఉండటం కూడా గమనిస్తుంటాం. ఈ సమస్యను రెసిన్‌ కెనాల్‌ డిస్‌కలరేషన్‌(ఆర్‌.సి.డి.) అంటారు. ఇంతకీ ఇవి ఏర్పడడానికి కారణం ఏమిటి? అన్నది ఇన్నాళ్లూ మిస్టరీగానే మిగిలిపోయింది. వాతావరణ మార్పుల వల్ల లేదా ఎరువుల ద్వారా ఈ పోగులు ఏర్పడుతున్నాయని గతంలో అనుకునేవారు.  
అయితే, ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ వల్ల మామిడి పండ్లకు సోకుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. కాయలు కోత, రవాణా, మగ్గబెట్టే దశల్లో ఒక రకమైన బాక్టీరియా సోకడం వల్ల మామిడి పండులో పోగులు ఏర్పడుతున్నట్లు  ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిస్థాయి పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ బాక్టీరియా ఇన్షెక్షన్‌ సోకకుండా చూసుకోవచ్చని రైతులకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి రైతులకు ఇది పెద్ద శుభవార్త అంటూ ఆస్ట్రేలియా మాంగో ఇండస్ట్రీ అసోసియేషన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాబర్ట్‌ గ్రే ఎగిరి గంతేశారు.

మామిడి పండుపై బాక్టీరియా పోగులు

లేపనం చేయని పండ్లు,  లేపనం చేసిన పండ్లు

అరటి నెమ్మదిగా మగ్గాలంటే.. గంజి లేపనం!  
అరటి గెలలు చెట్టు నుంచి కోసిన తర్వాత త్వరగా మగ్గిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోగలిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది. మరీ త్వరగా మగ్గిపోకుండా చూడటానికి శీతల గిడ్డంగిలో పెట్టడం ఒక పరిష్కారం. అయితే, ఇది భారీ ఖర్చుతో కూడిన పని. ప్రత్యామ్నాయం కోసం పరిశోధిస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన న్యూ క్యాజిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చిన్న రైతులకు కూడా ఉపయోగపడే ఒకానొక చవకైన, రసాయన రహితమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు. అరటి కాయలను గంజితో లేపనం చేయడం. వరి బియ్యం గంజికి సముద్రపు నాచు నుంచి సంగ్రహించిన కర్రగీన్‌ అనే పదార్థం కలిపి అరటి కాయలకు లేపనం చేసి సత్ఫలితాలు సాధించారు. త్వరగా మగ్గిపోయే స్వభావం ఉన్న కావెండిష్‌ రకం అరటి కాయలను 60 లాట్లుగా తీసుకొని ప్రయోగం చేశారు. ప్రతి లాట్‌లో 8 పండ్లు ఉంచారు. ఒక లాట్‌లో పండ్లను ఏమీ చేయకుండా పక్కన ఉంచారు. సగం లాట్లలో అరటిపండ్లకు గంజి పట్టించారు. మిగతా సగం లాట్లలో పండ్లను నీటిలో ముంచి తీశారు. వీటన్నిటినీ రెండు నిమిషాలు ఎయిర్‌ డ్రై చేసి.. ఎథిలిన్‌ ఛాంబర్‌లో 24 గంటలు ఉంచారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ లాట్లన్నిటినీ పరిశీలించారు. పండ్ల బరువు, శ్వాసక్రియ, ఎథిలిన్‌ ఉత్పత్తి, గంజి పరిమాణం, క్లోరోఫిల్‌ స్థాయిలను నమోదు చేశారు. గంజి లేపనం చేసిన పండ్ల శ్వాసక్రియ, తేమ నష్టం ఇతర పండ్లలో కన్నా తక్కువగా ఉన్నదని, అందువల్ల మగ్గే ప్రక్రియ కూడా నెమ్మదించినట్లు గుర్తించారు.


సత్యజిత్, అంజిక హంగె సోదరులు


పంటల వైవిధ్యం


పంటల మధ్య బంధు మిత్రులతో..

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం