పేరెంట్స్ కాదు... ఫ్రెండ్స్ అనిపించుకోండి!

20 Aug, 2015 23:30 IST|Sakshi
పేరెంట్స్ కాదు... ఫ్రెండ్స్ అనిపించుకోండి!

టీన్స్ కేర్
 
పిల్లలు చెడు తోవ పట్టడానికి మూలం టీనేజేనంటారు మానసిక శాస్త్రవేత్తలు. అందుకే పిల్లలు తప్పు దారి పట్టి పాడయిపోయారని బాధపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

అర్థం చేసుకోండి: ఎప్పటిలా కాకుండా మీ పిల్లలు వింతగా ప్రవర్తిస్తే, దానికి గల కారణాలపై దృష్టి పెట్టండి. వారు అలా ఉండటానికి కారణం తెలుసుకోండి. దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని జీవితంలో వారు సాధించాల్సిన విజయాలను, చేరాల్సిన గమ్యాలను గుర్తు చేయండి. తప్పొప్పులపై వారికి ఓ క్లారిటీ ఇవ్వండి.

సీరియస్‌గా తీసుకోకండి: పిల్లలు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెబుతుంటారు. వాదనకు దిగుతుంటారు. తమ ఫ్రెండ్స్ పేరంట్స్‌లా మీరు తమని ప్రేమించట్లేదని, అడిగింది ఇవ్వడం లేదని సాధిస్తుంటారు. వారిపై సీరియస్ అవకండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

{పేమతో చెబితే వింటారు: ఈ వయసులో పిల్లలు తాము చేసేదే కరెక్ట్ అని అనుకుంటారు. అదే టీనేజ్. ఆ మనస్తత్వం శాశ్వతం కాదు కాబట్టి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వారిపై అరవడం మానండి, కోపంతో కాకుండా ప్రేమతో చెప్పండి. వారిలో మార్పు తప్పకుండా వస్తుంది.

 ‘నో’ కి ‘నో’ చెప్పండి: చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు స్మార్ట్‌ఫోన్ అడిగినా, సినిమాకు వెళ్తామన్నా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తామన్నా ‘నో’ చెప్పేస్తుంటారు. అలా కాకుండా వారు అడిగిన వాటిలో కొన్నింటికైనా ఒప్పుకుంటే వారికి మీతో క్లోజ్ రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది. మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు.

మీపై నమ్మకం కలిగేలా ప్రవర్తించండి: టీనేజ్ పిల్లలు మిమ్మల్ని నమ్మితేనే మీతో అన్నీ షేర్ చేసుకుంటారు. మీ అబ్బాయి ‘‘మమ్మీ, నేనొకసారి ఫ్రెండ్స్‌తో కలిసి స్మోక్ చేశాను. తర్వాత మానేశాను’’ అని చెబితే నమ్మండి. అలాగే మీ అమ్మాయి విషయంలోనూ ప్రతిదానికి అనుమానించకండి. మీరు పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, వారు మీకంత దగ్గరవుతారు. అప్పుడే మీరు చెప్పే మంచీ చెడులను మనసుకు ఎక్కించుకుంటారు.

 బెస్ట్ ఫ్రెండ్‌గా మారండి: ప్రేమ వ్యవహారం, ఫ్రెండ్స్‌తో పార్టీలు, సినిమాలు మొదలైన వాటి గురించి పిల్లలు పేరెంట్స్‌తో చెప్పలేరు. ఫ్రెండ్స్‌తో మాత్రమే చెప్పుకుంటారు. అందుకే మీరే వారి బెస్ట్ ఫ్రెండ్‌గా మారితే ఇబ్బంది లేకుండా మీతో అన్నీ చెప్పుకోగలుగుతారు.
     
పర్సనల్ స్పేస్ ఇవ్వండి: మీ లైఫ్‌ను మీకెంత పర్సనలో, మీ పిల్లలకు కూడా అంతే పర్సనల్ కదా... మితిమీరిన అనుమానం వారిని మరిన్ని తప్పులు చేసేలా చేస్తుంది. వారికి ఎంత వరకు స్వేచ్ఛ అవసరమో గ్రహించి ఆ స్పేస్‌ను ఇవ్వండి. ఒకవేళ ఏదైనా పొరపాటు మీ నుంచి జరిగితే సారీ చెప్పండి. వారికి మీపై గౌరవం కలుగుతుంది.
 
 

మరిన్ని వార్తలు