ఉప్పునీటిలో చెరకు తీపివి

17 Nov, 2019 03:09 IST|Sakshi

సెలబ్రేషన్‌

సినీ సెలబ్రిటీలు ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం అన్నది శీతాకాలం చలిగా ఉంటుందన్నంత వాస్తవం. కోపం వస్తే ఒకరిని ఒకరు దూషించుకోవడం కూడా అంతే సహజం. అయితే ఇది కోపం సంగతి కాదు. కవిత్వం సంగతి! ఇటీవలే జన్మదినం జరుపుకున్న ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాను పరిణీతి చోప్రా ప్రశంసల కవిత్వంతో ముంచెత్తారు. జన్మదినం జరుపుకున్నందుకు కాదు ఆ ప్రశంసలు. సానియా అంటే తనకెంత ఇష్టమో చెప్పే ప్రశంసలు.

‘‘అవాస్తవంలో వాస్తవానివి. ఉప్పు నీటిలో తీపి చెరకువి’’ అంటూ ఆమెపై పొగడ్తలు కురిపించారు పరిణీతి. సానియా పుట్టినరోజు పండుగను ఇలా తియ్యటి మాటలతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రేట్‌ చేశారు.‘‘నువ్వంటే చాలా ఇష్టం. అబద్ధమనే సముద్రంలో వాస్తవానివి నువ్వు, భూమి మీద జన్మించిన దేవతవు నువ్వు, స్వయంశక్తితో ఎదిగావు, తెలివైనదానివి, నెమ్మదస్తురాలివి, సరదాగా ఉంటావు. నవ్వుతూ నవ్విస్తావు. నేను నిన్ను చాలా ఇష్టపడటానికి కారణం, నువ్వు నన్ను నన్నుగా చూశావు’ అంటూ  సాగింది ఆ  కవిత్వం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు