పెళ్లింట... ఒబామా ఆట...

31 Dec, 2014 23:13 IST|Sakshi
పెళ్లింట... ఒబామా ఆట...

రాజు తలచుకుంటే దెబ్బలకే కాదు దోస్తానాకూ కొదవుండదని అర్థమై ఉంటుందా పెళ్లివారికి. అమెరికాలోని హవాలిలో నివసించే ఆర్మీ అధికారులు నాటాలీ హెల్మెల్, ఎడ్వర్డ్ మాల్యూలు గత ఆదివారం తమ పెళ్లికని కనొహె గోల్ఫ్‌కోర్స్‌లో ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. తీరా పెళ్లికి పూట ఉందనగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్నేహితులతో కలిసి ఆదివారం గోల్ఫ్ ఆడడానికి వస్తున్నారు కాబట్టి పెళ్లి వేదికను మార్చుకోమని కబురు.

సాక్షాత్తూ ప్రెసిడెంట్ గారు ఆడుకోవడానికి వస్తుంటే పెళ్లీ పేరంటాలు ఒక అడ్డా?! దాంతో ఉస్సురంటూ ఆదరా బాదరాగా తమ సెటప్ మొత్తం అక్కడి నుంచి వేరే చోటుకి మార్చేసుకున్నారు. సరే. ఏమైతేనేం, పెళ్లి అయిపోయిన కాసేపటికి పెళ్లివారికి ఒబామా నుంచి ఫోన్. తన ఆట కారణంగా వారికి కలిగిన

ఇబ్బందికి సారీ చెప్పడంతో మొదలుపెట్టి, హనీమూన్ నుంచి గోల్ఫ్ ఆట విశేషాల దాకా వధూవరులతో కాసేపు ముచ్చటించి మరీ బై చెప్పారట. దీంతో వధూవరులు ఉబ్బితబ్బిబ్బయిపోయి... ఇది తమకు ఒక మెమొరబుల్ డే అంటూ అధ్యక్షుల వారి ఆట దెబ్బకు తమ పెళ్లి అడ్రస్ మారిపోవడాన్ని లైట్ తీసేసుకున్నారు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు