పూచిన తామరలు

15 Nov, 2019 02:20 IST|Sakshi

ఫ్యాషన్‌

కలంకారితో అలంకరణ ఎప్పుడూ బాగుంటుంది. ఆ కలంకారి డిజైన్‌లో పూచిన తామరలు ఉంటే ఇంకా బాగుంటుంది. మరి అంచులు బెనారస్‌ పట్టుతో ముడిపడితే? ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. కొత్తలుక్కు కోసం ఈ తామర కలంకారిని ఉపయోగించి చూడండి. వికసించిన కమల సౌందర్యం సొంతం చేసుకోండి.

కలంకారీ డిజైన్స్‌ ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉన్నవే. వీటిని ఎంత కొత్తగా చూపిస్తున్నామన్నదే ముఖ్యం. సాధారణంగా కలంకారీ అనగానే నెమళ్లు, తీగలు, కొమ్మలు.. ఇవే కనిపిస్తుంటాయి. ఈ చీరలలో వివిధ రూపాలలో ఉండే తామరపువ్వు డిజైన్స్‌ను ఒక థీమ్‌గా తీసుకున్నాం. ఈ పెన్‌ కలంకారీలో వాడిన రంగులన్నీ నేచరుల్‌ కలర్స్‌ మాత్రమే. డల్‌ లుక్‌ రాకుండా ఉండటం కోసం బెనారస్‌ పట్టును అంచులుగా జత చేశాం. ఇవి ఏ ప్రత్యేక సందర్భాలలోనైనా అన్ని వయసుల వారు ధరించవచ్చు.   

►కలంకారీ కళ తెలుగువారి సొంతం. అద్భుతమైన చేతిపనితనంతో దుస్తులను అందంగా తయారుచేస్తారు కళాకారులు. ప్లెయిన్‌ ప్యూర్‌ పట్టు చీర మీద రూపుదిద్దుకున్న పెన్‌ కలంకారీ డిజైన్లు వేడుకల సందర్భంలో ఓ అద్భుతమైన కళను తీసుకుస్తాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. ప్లెయిన్‌ పట్టుకు కలంకారీ డిజైన్‌ను వేయించుకున్నాక బామ్మల కాలం నాటి బెనారస్, కంచి పట్టు చీరల పెద్ద పెద్ద అంచులనూ బార్డర్స్‌గా వాడుకోవచ్చు. దీని వల్ల చీరకు, లెహంగా, దుపట్టా డిజైన్లకు మరింత గ్రాండ్‌ లుక్‌ వస్తుంది. ఏ వేడుకలోనైనా హైలైట్‌ అవుతుంది.

►జాతీయస్థాయిలో పెన్‌ కలంకారీకి డిజైన్స్‌కి గొప్ప పేరుంది. కలంకారీ డిజైనర్‌ పట్టు చీరలు ఏ వేడుకల్లో ధరించినా కళను, హుందాతనాన్ని, గొప్పదనాన్ని, మనదైన ఆత్మను ప్రతిఫలింపజేస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలంకారీ డిజైనర్‌ చీరలను యువతరం వారి అభిరుచిమేరకు ఏ కాలమైన మరో ఎంపిక అవసరం లేకుండా ధరించవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు