అమరాంజనేయస్వామి!

15 Apr, 2014 23:44 IST|Sakshi
అమరాంజనేయస్వామి!

నమ్మకం
ఆ బాలుడి పేరు అమర్‌సింగ్. వయసు ఆరు సంవత్సరాలు. ఇతడిది ఉత్తరప్రదేశ్‌లోని నిజ్మాపూర్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఐదుమంది తోబుట్టువుల్లో అందరి కన్నా చిన్నవాడు.ఆమర్ ఇప్పుడు వాళ్ల ఊరిలో ప్రత్యేకమైన వాడు.

అతడిని ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తోంది ఆ గ్రామం మొత్తం. అందుకు కారణం అమర్‌కు వెన్నెముకకు కింది భాగంలో శరీరంపై పొడవాటి రోమాలు ఉండటమే. పొడవుగా పెరిగిన అవాంఛిత రోమాలు  అతడు ఆంజనేయస్వామి అంశ అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

గ్రామస్తులే కాదు, అమర్ కుటుంబం కూడా అదే అభిప్రాయంతో ఉంది. తమకు దైవాంశ పుట్టాడని అమర్ తండ్రి అంటున్నాడు. తమ కుమారుడికి ఆ వెంట్రుకలు వరంగా లభించాయని ఆయన అంటున్నాడు. ఇక అమర్‌కు అలా వెంట్రుకలు పెరగడం స్పైనా బిఫిడా ప్రభావమే అంటున్నారు వైద్యులు.

వెన్నెముకకు సంబంధించిన చిన్నపాటి సమస్యతో అలా వెంట్రుకలు పెరగడం జరుగుతుందని వైద్యుల అభిప్రాయం. అయితే ఇలా వెంట్రుకలు పెరగడం వల్ల అసౌకర్యం ఉండవచ్చునేమో కానీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ర్పభావం ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు