నయం చేసే మిరియం

17 Jul, 2017 23:31 IST|Sakshi
నయం చేసే మిరియం

గుడ్‌ఫుడ్‌

మిరియాలు ఆహారానికి రుచిని మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. మిరియాలలో యాంటీబయాటిక్‌ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్‌ను  నిరోధిస్తాయి. ∙మిరియాలు ఉన్న ఆహారం తిన్న వెంటనే అవి జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవింపజేసేలా చూస్తాయి. అందుకే మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ.

అంతేకాదు మలబద్దకాన్ని, డయేరియా ను సైతం నివారిస్తాయి. ∙జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే ఇంటి చిట్కా మిరియాలే. ఇలా అవి జలుబు, దగ్గులను నివారించడానికి కారణం వాటిలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణమే. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు  అరికడతాయి. తద్వారా ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. నిత్యం మిరియాలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో పొట్ట పెరగదని పరిశోధనలలో తేలింది. ∙మిరియాలు చుండ్రును నివారిస్తాయి. ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్‌ సమస్యకు మిరియాలు మంచి  ఉపశమనం.

మరిన్ని వార్తలు