పరి పరిశోధన

31 Mar, 2018 03:16 IST|Sakshi

కాఫీతో గుండె జబ్బులు దూరం

కాఫీ ప్రియులకు ఒక శుభవార్త! కాఫీ గుండె జబ్బులను దూరం చేస్తుందట. ఈ సంగతి ఒక తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తాగే అలవాటు ఉంటే... ధమనులు ఆరోగ్యంగా తయారై, గుండె భేషుగ్గా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ సావో పాలోకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాఫీలో పుష్కలంగా ఉండే కెఫీన్‌... ధమనుల్లో క్యాల్షియం వ్యర్థాలు పేరుకుపోకుండా చేస్తుందని, ఫలితంగా రక్తప్రసరణ సాఫీగా జరిగి గుండె చక్కగా పనిచేస్తుందని వారు వివరిస్తున్నారు.

రోజుకు మూడు కప్పులు లేదా అంత కంటే ఎక్కువ మోతాదులో కాఫీ తాగే అలవాటు ఉన్నవారిపై పరీక్షలు జరిపి చూస్తే, వారి ధమనుల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా ఉన్నట్లు తేలిందని సావో పాలో వర్సిటీ శాస్త్రవేత్త మిరాండా తెలిపారు. గుండె ఆరోగ్యంపై కాఫీ ప్రభావాన్ని గుర్తించడానికి 4,400 మందిపై పరీక్షలు జరిపి ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు