సేంద్రియ ఆహారంతో క్యాన్సర్‌కు చెక్‌

23 Oct, 2018 14:29 IST|Sakshi

లండన్‌ : క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు 86 శాతం వరకూ తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. బ్లడ్‌ క్యాన్సర్‌ సహా ఏ తరహా క్యాన్సర్‌ ముప్పు అయినా సేంద్రియ ఆహారం మాత్రమే తీసుకునేవారికి 25 శాతం తక్కుగా ఉంటుందని, చర్మ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌లు సోకే అవకాశం మూడోవంతు తగ్గుతుందని అథ్యయనం పేర్కొంది. స్ధూలకాయుల్లో సేంద్రియ ఆహారంతో మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని తమ అథ్యయనంలో గుర్తించామని పరిశోధకులు పేర్కొంది.

సేంద్రియ ఆహారాన్ని అధికంగా తీసుకునే వారిలో క్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధన వెల్లడించిందని అథ్యయన రచయిత, సెంటర్‌ ఆఫ్‌ రీసెర్చి ఇన్‌ ఎపిడెమాలజీకి చెందిన డాక్టర్‌ జులియా బుద్రీ చెప్పారు. పురుగుమందులు వాడకుండా పండించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చని, క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రజలు సేంద్రియ ఆహారాన్నే తీసుకోవాలని సూచించారు. అథ్యయన వివరాలు జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు