క్యాన్సర్లను తరిమికొట్టే దానిమ్మ!

13 Jul, 2018 00:14 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌

దానిమ్మ పండును క్రమం తప్పకుండా తినడం అంటే క్యాన్సర్‌ను దూరంగా తరిమికొట్టడమే. దానిమ్మలో ఉండే ప్యూనికలాజిన్‌ అనే అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఇందుకు కారణం. దానిమ్మలో విటమిన్‌ కె విటమిన్‌ బి5లతో పాటు విటమిన్‌ సి ఎక్కువ. ఫలితంగా దీన్ని తినడం వల్ల ప్రోస్టేట్‌ క్యాన్సర్, బ్రెస్ట్‌ క్యాన్సర్, కోలన్‌ క్యాన్సర్, లుకేమియా వంటి అనేక క్యాన్సర్లు నివారితమవుతాయి. క్యాన్సర్‌ నివారణ మాత్రమే కాకుండా దానిమ్మతో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిల్లో ఇవి కొన్ని... 

►దానిమ్మలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనోల్స్, అనేక యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఇవన్నీ మనకు శక్తిమంతమైన  రోగనిరోధక శక్తిని సమకూరుస్తాయి.  
►దానిమ్మలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మలబద్దకం వంటి సమస్యలను దరిచేరనివ్వదు. 
►డయాబెటిస్‌ రోగులకు ఎన్నో పండ్ల మీద ఆంక్షలుంటాయిగానీ.. దానిమ్మ విషయానికి వస్తే డయాబెటిస్‌ రోగులు దానిమ్మ తినాలంటూ డాక్టర్లే సూచిస్తారు. 
►బరువు తగ్గించుకోవాలనుకున్నవారికి దానిమ్మ మంచి పండు. అది కొవ్వులను అదుపులో ఉంచి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. 
►కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా ఇది ఇస్కిమిక్‌ కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ వంటి గుండెజబ్బులను నివారిస్తుంది. గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 
►ఇది అధిక రక్తపోటు, అర్థరైటిస్, కీళ్లనొప్పులు, గుండెజబ్బులను నివారిస్తుంది.
►దానిమ్మ వల్ల చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. చర్మకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. వయసు పెరిగేకొద్ది కనపడే  ముడతలు, మచ్చలు, గీతలను నివారిస్తుంది. అందుకే దానిమ్మపండు తినేవారు దీర్ఘకాలం యౌవనంతో కనిపిస్తారు. 
►వాపు, మంట, ఎర్రబారడం వంటి ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది.

 
 

>
మరిన్ని వార్తలు