దానిమ్మతోనూ అమ్మ లాంటి మేలు

6 Jul, 2017 23:25 IST|Sakshi
దానిమ్మతోనూ అమ్మ లాంటి మేలు

గుడ్‌ఫుడ్‌

దానిమ్మలో చక్కెర పాళ్లు తక్కువ, డయాబెటిస్‌ వారికీ ఉపయోగకరం.   దానిమ్మలో జీర్ణక్రియకు ఉపకరించే పీచు సమృద్ధిగా ఉంటుంది. మలబద్దకం దరిచేరదు.   ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనోల్స్, యాంటి ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఈ ఫైటో కెమికల్స్‌ శరీర నిర్మాణ పోషకాలను సమకూర్చడంతో పాటు చక్కటి రోగనిరోధక శక్తినిస్తాయి.  దానిమ్మలో విటమిన్‌ కె, విటమిన్‌ బి5, విటమిన్‌ సి ఎక్కువ. ఇవి ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్‌ క్యాన్సర్, లుకేమియా వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి.కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుతుంది.

రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా ఇస్కిమిక్‌ కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ను నివారిస్తుంది.గుండె సమస్యలున్న వాళ్లు రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తీసుకుంటే మంచిది.చర్మం పై పొరను కాపాడుతుంది, చర్మకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మేను మిలమిల మెరిసేలా దోహదపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ముడతలు, మచ్చలు, గీతలను నివారిస్తుంది. ఎండకు వెళ్లినప్పుడు చర్మం వడలిపోకుండా రక్షిస్తుంది.వాపులను, నొప్పులను తగ్గిస్తుంది.

మరిన్ని వార్తలు