బంగాళదుంపల్లో...బంగారం నువ్వేలే!

10 Jun, 2014 23:47 IST|Sakshi
బంగాళదుంపల్లో...బంగారం నువ్వేలే!

మెన్స్ హెల్త్
బంగాళదుంపలు తినడం  రుచికి మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా చాలామంచిదని పౌష్టికాహార నిపుణులు చెబుతారు. మీరు తీసుకొనే ఆహారంలో బంగాళదుంపలు ఎంత శాతం తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే రోజూ తినండి.
వీటి వల్ల ఉపయోగాలు.....
విటమిన్ బి6
- బంగాళదుంపలలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది.
- ఇది గుండెపోటు రాకుండా నివారిస్తుంది.

విటమిన్ సి
- దంతాలు, ఎముకలు, జీర్ణక్రియ... మొదలైన వాటిలో కీలక పాత్ర పోషించే విటమిన్- సి బంగాళదుంపలలో పుష్కలం.
- చర్మసంరక్షణకు, ఒత్తిడి నుంచి విముక్తి కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
 
విటమిన్ డి
- సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌లు రాకుండా అడ్డుకునే ’విటమిన్-డి’ బంగాళదుంపలలో ఉంటుంది.
- గుండె, నరాలు, దంతాలు, చర్మానికి ఈ విటమిన్ మేలు చేస్తుంది.

ఐరన్... అమోఘం
- శరీరంలో  ముఖ్య విధులు నిర్వహించే ఐరన్‌కు బంగాళదుంపలలో కొదవలేదు.

మరిన్ని వార్తలు