స్వీట్‌ చట్నీ

30 Jun, 2018 03:01 IST|Sakshi

కావలసినవి: చింతపండు – అర కప్పు; గింజలు లేని ఖర్జూరాలు – అర కప్పు; బెల్లం తురుము – అర కప్పు; నీళ్లు – 2 కప్పులు; వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: బాణలిలో చింతపండు, ఖర్జూరాలు, నీళ్లు వేసి స్టౌ మీద పెట్టి సుమారు పది నిమిషాల పాటు పదార్థాలు మెత్తబడేవరకు ఉడికించాలి
బెల్లం తురుము జత చేసి బాగా కలియబెట్టాలి
జీలకర్ర పొడి, ధనియాల పొడి, శొంఠి పొడి, మిరపకారం జత చేసి మరోమారు కలపాలి
ఉప్పు జత చసి బాగా కలిపి దింపేయాలి
బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
మిశ్రమాన్ని వడగట్టి, డబ్బాలోకి తీసుకోవాలి
ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే, ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి.

గ్రీన్‌ చట్నీ
కావలసినవి:
కొత్తిమీర – 2 కప్పులు; పచ్చిమిర్చి – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మరసం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; చాట్‌ మసాలా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి
మిక్సీ జార్‌లో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, నిమ్మ రసం, చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, అల్లం ముక్క, ఉప్పు వేసి మెత్తగా చేసి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి
అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయ వచ్చు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విలనిజం నా డ్రీమ్‌ రోల్‌

చెట్టు దిగిన  చిక్కుముడి

ఏసీ వల్లనే ఈ సమస్యా? 

మహిళావని

మనీ ప్లాంట్‌

రిజల్ట్స్‌ పరీక్ష కాకూడదు

నన్నడగొద్దు ప్లీజ్‌

తాననుకున్నట్లుంటేనే దేవుడైనా..

తుపాకీ అవ్వలు

టిఫిన్‌ బాక్స్‌ 

ఆడెవడు!

ప్రతిభను పక్కన పెడ్తారా?

రారండోయ్‌

తెలుగు నానుడి

కమ్మదనమేనా అమ్మతనం?

నిర్భయ భారత్‌

లో లొంగదు

కిడ్నీపై దుష్ప్రభావం పడిందంటున్నారు

బలిపీఠం...సకలభూత నైవేద్యపీఠం

‘నఫిల్‌’తో  అల్లాహ్‌ ప్రసన్నత

‘అమ్మా! నన్ను కూడా...’

ప్రపంచానికి వరం పునరుత్థాన శక్తి

కంటే కూతుర్నే కనాలి

‘పెళ్లి పిలుపులు రాని తల్లి’

ఎవరెస్ట్ అంచున పూజ

ఆ రుచే వేరబ్బా!!!

మెదడు పనితీరును  మెరుగుపరిచే నిద్ర

పుల్లగా ఉన్నా ఫుల్లుగా నచ్చుతుంది

ఎండ నుంచి మేనికి రక్షణ

బ్రేకింగ్‌ తీర్పు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌..వెరీ స్పెషల్‌!

షూటింగ్‌ సెట్‌లో అయాన్‌, అర్హా

వారి మధ్య స్మాష్‌ అయిపోయా..!!

రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్‌..

‘సీత’ ఎప్పుడొస్తుందో!

హీరోయిన్‌ను నిజంగానే ఏడిపించారు!