కేన్సర్‌పై పోరాటానికి ప్రొటీన్‌ సిద్ధమైంది

17 Jan, 2019 01:00 IST|Sakshi

దుష్ప్రభావాలు ఏమీ లేకుండానే కేన్సర్‌కు చికిత్స కల్పించాలన్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం ఒక ప్రొటీన్‌ను కృత్రిమంగా సిద్ధం చేశారు. రోగ నియంత్రణ వ్యవస్థలో కీలకమైన ఇంటర్‌ల్యూకిన్‌ –2 (ఐఎల్‌–2) కేన్సర్‌తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ వంటి అనేక ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు చికిత్స కల్పించగలదు. అయితే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొటీన్‌ డిజైన్‌ విభాగం కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఐఎల్‌–2 ను పోలిన కృత్రిమ ప్రొటీన్‌ను డిజైన్‌ చేశారు.

జంతువుల్లో జరిగిన ప్రయోగాల్లో ఈ కృత్రిమ ప్రొటీన్‌ కేన్సర్‌ కణాలపై దాడి చేయగల టీ– కణాలను చైతన్యవంతం చేసినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. నియో –2/15 అని పిలిచే ఈ కృత్రిమ ప్రొటీన్‌ ఇంటర్‌ల్యూకిన్‌ –15 ప్రొటీన్‌లా కూడా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు దాదాపు 30 ఏళ్లుగా ఐఎల్‌–2ను సురక్షితంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. నియో –2/15 ద్వారా ఇది సాధ్యమవుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేయిన్‌ అడ్రియానో సిల్వా తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే నియో –2/15 ద్వారా కేన్సర్‌కు మరింత మెరుగైన, దుష్ప్రభావాలు ఏవీ లేని చికిత్స అందుతుందని అంచనా 

మరిన్ని వార్తలు