సోరియాసిస్ (psoriasis)

11 Jan, 2014 23:38 IST|Sakshi
సోరియాసిస్ (psoriasis)

సోరియాసిస్ మచ్చలు పింక్ లేక ఎరుపు వర్ణంలో పొలుసులతో కూడి ఉంటాయి. చర్మం దళసరిగా ఉంటుంది. ఈ పొలుసులను బలవంతంగా తీస్తే వాటి కింద ఎర్రటి రక్తపు మచ్చలుగా కనిపిస్తాయి. ఈ సోరియాసిస్ మచ్చలు. కొంచెం కాని, ఎక్కువ సంఖ్యలోగాని ఉంటాయి.
 
 శరీరంలోని చాలా భాగాలలో అంటే చేతులు, కాళ్ళు, తల, వీపుమీద, మోకాళ్ళ ముందుభాగాన, ఉదరం, అరికాళ్ళు, అరిచేతులలో అధికంగా ఈ మచ్చలు వస్తాయి.
 
 పొలుసులు చాలా దట్టంగా, అధికంగా ఉండి కొవ్వొత్తి మైనం లాగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాపుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా చాతి, కాళ్ళమీద...
 
 సోరియాసిస్ ప్రధానంగా యుక్త, మధ్య వయస్సులో అధికంగా కనిపిస్తుంది. చాలా తక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులలో కనిపించవచ్చు.
 
 అధిక వత్తిడి వలన, వంశపారంపర్యంగా తల్లిదండ్రులకు ఉంటే వారి పిల్లలకు ఈ వ్యాధి రావటానికి అవకాశాలుంటాయి.
 
 కాలివేళ్ళు, చేతివేళ్ళ గోళ్లలో గుంటలు పడినట్లు ఉంటాయి.
 
 చికిత్సా విధానం
 ప్రధానంగా సోరియాసిస్ (కిటిభ కుష్టం) అనే వ్యాధిలో పంచకర్మ చికిత్సా విధానం ఎంతో ప్రముఖమైనది. ఈ పంచకర్మ విధానంలో వమన కర్మ ప్రధానమైనది. దీనివలన శరీరంలో ఉన్న చెడుభావాలు రసాయనాలు మొదలగు శరీరం నుండి బయటికి పంపబడతాయి.
 
 తక్రధార:  ఈ చికిత్సా విధానంలో ప్రత్యేకంగా ఔషధాలతో తయారు చేయబడిన తక్రము లేదా మజ్జిగ  ధారతో మచ్చలు గల శరీర భాగలను శుభ్రంగా తడపటం జరుగుతుంది. దీనివలన శరీరంపై భాగంలోని పొలుసులన్నీ ఊడిపోతాయి.
 
 నివారణ
 మానసిక వత్తిడి నుండి పూర్తిగా విముక్తి వలన
 
 పులుపు పదార్థాలు, మాంసాహార సేవన, సముద్ర ఉత్పత్తులు పూర్తిగా నిషేధించటం వలన
 
 వాయుకాలుష్యం, జల కాలుష్యం నుంచి దూరంగా ఉండటం
 
 పరిశ్రమలలో సరైన రక్షణ విధానాలు పాటించటం వలన నివారించవచ్చు.
 
 డాక్టర్ దీప్తి ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద,
 సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, విజయవాడ, విశాఖపట్నం,
 తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక
 ph: 8977 336688 / 90300 85456
 www.starayurveda.com, Email : info@starayurveda.com

 

మరిన్ని వార్తలు