సెకియాట్రిక్ : అంగీకరించకపోతే ఏం చేయాలి?

3 Aug, 2013 00:10 IST|Sakshi

నేను ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా సీనియర్‌ని రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి మతాలూ వేరువేరు. ఈ కారణంగా మా వివాహానికి మా పేరెంట్స్ అంగీకరించట్లేదు. అతడికి ఇంకా ఉద్యోగం దొరకలేదు. అతడిని వివాహం చేసుకోవడం వల్ల నేను ఇబ్బందులపాలవుతానని మా వాళ్లు అంటున్నారు. సంపన్నుల ఇంటి అబ్బాయిని చేసుకుని, అమెరికాలో ఉండవచ్చు కదా అంటున్నారు. అతడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. మా తల్లిదండ్రుల సంపూర్ణ సహకారంతో అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు ఒప్పుకోకపోతే నాకు ఆత్మహత్య తప్ప, మార్గం లేదు.
 - సాగర్, కరీంనగర్
 
 మొట్టమొదట మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అంతేకాని ఆత్మహత్య పరిష్కారం అనుకోకండి. తల్లిదండ్రులు ప్రేమను వ్యతిరేకించడం, చాలా కుటుంబాలలో సర్వసాధారణం. మీ తల్లిదండ్రులు మీ గురించి సరిగ్గానే ఆలోచిస్తున్నారని ముందుగా అర్థం చేసుకోండి. ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లల్ని ప్రేమిస్తారే కానీ ద్వేషించరు. మీరు నిరాశలో ఉండి, మీ తల్లిదండ్రుల గురించి సరిగా అర్థం చేసుకోవట్లేదు.
 
 ముందుగా ఇటువంటి విషయాలను భావోద్వేగాలతో కాకుండా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రపంచాన్ని చూశారు. మంచిచెడులు వారికి మీ కంటె బాగా తెలుస్తాయి. మీ వయసులో ఉన్నవారికి... పెళ్లికి ముందు కలిగే ప్రేమ, పెళ్లి తరవాత నిలబెట్టుకోవలసిన ప్రేమకు తేడా తెలియదు. ప్రేమ ఒక ఆకర్షణ మాత్రమే. ఇందులో మునిగిపోయినవారికి అన్నీ కరెక్ట్‌గానే అనిపిస్తాయి. అందువల్లే అన్నిటికీ సర్దుకుపోగలమని అనుకుంటారు. అనుభవంలోకి వస్తేనే కాని సమస్యలను ఎదుర్కోవడం ఎంత కష్టమో తెలియదు.
 
 చాలా ప్రేమ వివాహాలలో ఎదురయ్యే సమస్యలలో మొదటిది... వారు జీవితంలోకి ఎన్నో ఆశలతో, కలలతో ప్రవేశిస్తారు. సర్దుకుపోవడమనేది వారికి తెలియదు. ప్రేమ, పెళ్లి వంటివి సినిమాలలోలాగ నిజ జీవితంలో సాధ్యం కాదు. ఆకర్షణలో పడి వివాహం చేసుకున్నప్పటికీ, జీవితంలో సర్దుకోలేక ఎంతోమంది విడిపోతున్నారు. అందువల్లే చాలామంది తల్లిదండ్రులు ప్రేమ వివాహాల గురించి భయపడుతున్నారు. వివాహబంధం... కలకాలం నిలబడాలే కాని, మధ్యలో తెగిపోయేలా ఉండకూడదు. మీ జీవితం కలకాలం పచ్చగా ఉండాలని తెలుసుకోండి. పైన చెప్పిన విషయాలన్నీ మీ మనసుకి అంగీకారంగా ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకోండి. మీ తల్లిదండ్రులతో ప్రశాంతంగా చర్చించండి. సమస్యకు పరిష్కారం లభించకపోతే, ఒక ప్రొఫెషనల్ సహాయంతో సమస్యను మధ్యేమార్గంగా పరిష్కరించుకోండి.
 - డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
 సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’