క్విక్ ఫుడ్

12 Dec, 2016 14:49 IST|Sakshi
క్విక్ ఫుడ్

పనీర్-కాజూ స్నాక్

కావలసినవి  పనీర్: 100 గ్రా, జీడిపప్పు: 100 గ్రా (కచ్చాపచ్చాగా పలుకులు చేయాలి), కార్న్‌ఫ్లోర్: రెండు టీ స్పూన్లు , జీలకర్రపొడి : టీ స్పూన్, పసుపు: చిటికెడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: చిన్నకప్పు, నూనె: ఫ్రైకి సరిపడ, కొత్తిమీర తరుగు: టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు: టీ స్పూన్, గరంమసాలా పౌడర్:  టీ స్పూన్, ఉల్లికాడల తరుగు: టీ స్పూన్, ఉప్పు: తగినంత

తయారి  పనీర్‌ని పది నిమిషాల సేపు వేడినీటిలో ఉంచి తీశాక మెత్తగా చిదమాలి. అందులో కార్న్‌ఫ్లోర్, జీలకర్రపొడి, గరంమసాలాపొడి, ఉల్లిపాయ తరుగు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు పలుకులను ఒక గిన్నెలో వేసి... తగినన్ని నీటితో ముద్దలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడిచేయాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని అరచేతిలో వేసి కావలసిన షేప్‌లో ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి. నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే పేపర్ అదనంగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది. ఈ పనీర్- కాజు స్నాక్‌కు టొమాటో సాస్ మంచి కాంబినేషన్. ఈవెనింగ్ స్నాక్‌గా చాలా బాగుంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అన్నం పంచే అబ్బాయి

ఇటలీలో మన గాయని

కరోనా హీరో  డాక్టర్‌ అపూర్వ

మోదీ కాలింగ్‌ ఈజ్‌ దట్‌ సిస్టర్‌ ఛాయ?

నిజమైన హీరోలు కావాలి

సినిమా

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..

ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి