బుడ్డోడు ముద్దొస్తున్నాడు!

15 Oct, 2017 00:41 IST|Sakshi

ముద్దుకు మరింత ముద్దొచ్చింది... బుడ్డోణ్ణి చూడగానే! మరి, ముద్దుగుమ్మ రాశీ ఖన్నా మాత్రం ఎందుకు ఊరుకుంటారు? వెంటనే చేతుల్లోకి తీసుకుని బుగ్గలపై ముద్దులిచ్చేశారు. రాశి ముద్దుల్లో మాధుర్యం తెలిసే వయసు కాదు కదా ఆ బుడ్డోడిది? అందువల్లే బుంగమూతి పెట్టినట్టున్నాడు.

అయినా... వాణ్ణి రాశి వదల్లేదు. కాసేపు ఆడుకున్నారు. తర్వాత బ్యాక్‌ టు షూట్‌! లండన్‌లోని ‘తొలిప్రేమ’ లొకేషన్‌లో సీన్‌ ఇది! వరుణ్‌తేజ్‌కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్న చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ ‘తొలిప్రేమ’ చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది.

టైమ్‌ వేస్ట్‌ చేయకుండా వీలైతే రాత్రిపూట కూడా షూటింగ్‌ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ఇలాంటి స్పెషల్‌ మూమెంట్స్‌ ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఫర్‌ ఎగ్జాంపుల్‌... రాశీ ఖన్నా గరిటె తిప్పడం వంటివి. మరి.. ఆ ఫుడ్‌ టేస్ట్‌ ఎలా ఉందో తిన్నోళ్లే చెప్పాలి!!

మరిన్ని వార్తలు