వ్యాధుల వర్షం

20 Jul, 2016 23:29 IST|Sakshi
వ్యాధుల వర్షం

వర్షం సంతోషాన్ని తెస్తుంది.
జాగ్రత్తపడకపోతే కుండెడు వ్యాధులనూ తెస్తుంది.
ప్రత్యేకంగా పిల్లలకు, వృద్ధులకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ.
అలాగే ఆఫీసులకు వెళ్లి వస్తూ వానలో తడిసే వాళ్లకు కూడా జాగ్రత్తలు అవసరం.
మంచి అవగాహన, కొద్దిపాటి జాగ్రత్తలతో
మీ ఫ్యామిలీ బాగుండాలని... మన ఫ్యామిలీ చెబుతోంది.

 
ఈగలతో వచ్చే వ్యాధులు
ఈ సీజన్‌లో వర్షాలు మొదలుకాగానే ఈగలు తప్పక కనిపిస్తుంటాయి. ముసురు పట్టగానే మరీ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఈగలతో దాదాపు నూరు రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలరు. ఈగ లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు. . ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని...

అమీబియాసిస్ : ఇవి ప్రోటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములు. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు సైతం దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

 జియార్డియాసిస్ : ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ జీవులు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. తిన్న ఆహారం ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్‌జార్ప్‌షన్) వంటివి కూడా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తుంటుంది.
 
నీరు కలుషితం కావడం వల్ల
ఈ సీజన్‌లో నీరు కలుషితం కావడం వల్ల కనిపించే ప్రధాన వ్యాధులు...
 
టైఫాయిడ్ : సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు.

కలరా : విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. తీవ్రమైన నీళ్ల విరేచనాలు, వాంతులు వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడిపోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అందుకే ప్రత్యేకంగా ఈ లక్షణాన్ని రైస్ వాటర్ స్టూల్స్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే కిడ్నీలు పాడైపోవడం వంటి పరిణామాలు సంభవించి, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
 
షిజెల్లోసిస్ : జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఈ వ్యాధి లక్షణాలు. పేగులో ఇన్ఫెక్షన్ వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్‌తో పాటు రక్తంలో యూరియా పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగి, రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ర్పభావాలూ కనిపించవచ్చు.
 
ఈ-కొలై : నీళ్ల విరేచనాలకు దారితీసే ఈ కండిషన్‌కు ‘ఈ-కొలై’ అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్ర కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
 
 
దోమలతో వచ్చే వ్యాధులు

మలేరియా : ఇది అనాఫిలస్ దోమతో వ్యాప్తి చెందే వ్యాధి. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్షజీవి వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో ఒక రకం (స్పీషీస్) వల్ల సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి రావచ్చు.
 
చికన్ గున్యా : ఇది ఎడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఏడిస్ ఈజిప్టై దోమ సాధారణంగా పగటి వేళ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కీళ్లనొప్పులు భరించలేనంతగా ఉంటాయి.
 
డెంగ్యూ : ఈ వ్యాధికి సైతం ఏడిస్ ఈజిప్టై దోమలే కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయావాల్లో రక్తస్రావం కూడా జరగవచ్చు.
 
 
ఎలుకల వల్ల
వర్షాలకు ఎలుకలు బయట నుంచి ఇంట్లోకి రావడం వల్ల లెప్టో స్పైరోసిస్ అనే  వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోయి ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్‌లో నీళ్లలో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడం కూడా జరుగుతుంది.
 
వర్షాకాలపు వ్యాధుల నివారణ
ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం.కుండల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగకండి.వాటర్‌ను డిస్ ఇన్ఫెక్ట్ చేయుడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది.బయుటి ఆహార పదార్థాలు ఈ సీజన్‌లో వద్దు.తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినవద్దు.వూంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. కానీ ఈగల వంటివి ముసరడానికి శాకాహారంతో పోలిస్తే మాంసాహారం వల్ల అవకాశం ఎక్కువ. సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా  ఉడికించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మాంసాహారంతో వచ్చే ముప్పును తప్పించుకోవచ్చు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నీళ్ల నిల్వకు అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తారుు. నీటి నిల్వకు అవకాశం ఇచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పెపైచ్చులు ఊడిపోయిన సన్‌షేడ్‌కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి బ్రీడింగ్ చేస్తాయి. కాబట్టి మీ ఇంటి వద్ద దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివరించండి. దోమ తెరలు వాడటం మేలు.

ఈ సీజన్‌లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి.ఇంటి కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం మేలు.  కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే. అయితే కిటికీలకు అంటించడానికి సంసిద్ధంగా ఉండే మెల్‌క్రో వంటి ప్లాస్టిక్ మెష్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్‌లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభుల్లో ఇలాంటి అలర్జీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు దూరంగా ఉన్న కుండీలలో వేస్తుండాలి. వీధిలో ఉండే కుండీలను సైతం సిబ్బంది తరచూ శుభ్రం చేసేలా జాగ్రత్త వహించాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి.కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయువద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయుంలో సబ్బు లేదా బూడిద వూత్రమే వాడాలి.వానలో అతిగా తడసిన సందర్భాల్లో అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడే వారిలో నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్త వహించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు ఎక్కువగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులను... మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు