‘స్వచ్ఛ’మేవ జయతే

2 Oct, 2019 04:47 IST|Sakshi

స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో కేంద్రం తలపెట్టిన అత్యంత ప్రధానమైన పారిశుధ్య కార్యక్రమం స్వచ్ఛ భారత్‌ అభియాన్‌. దేశవ్యాప్తంగా 34 లక్షల మంది ప్రభుత్వోద్యోగుల సహకారంతో సాగుతున్న స్వచ్ఛభారత్, పారిశుధ్య కల్పన విషయంలో ప్రపంచంలోనే అత్యంత బృహత్‌ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ‘స్వచ్ఛ, పరిశుభ్రమైన భారత్‌ గురించి మహాత్మాగాంధీ కన్న స్వప్నాన్ని పరిపూర్తి చేయడమే దీని లక్ష్యం’ అని మోదీ పేర్కొనడంతో స్వచ్ఛభారత్‌ అంతర్జాతీయ ప్రచారం పొందింది.మరి స్వచ్చభారత్‌ కార్యక్రమానికి మూలమైన మహాత్మాగాంధీ పరిశుద్ధ భారత్‌ భావన ఎలా ఉనికిలోకి వచ్చింది? దీన్ని తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఆచరణలోకి తీసుకొచి్చన గాంధీ భారత్‌లో మరింత విస్తృతస్థాయిలో పాటించారు. వందేళ్ల క్రితం మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం తిరిగొచి్చనప్పుడు భారతీయ సమాజాన్ని పారిశుధ్యం తోటే అనుసంధానం చేశారు.  కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో గాంధీ అశుద్ధాన్ని చూసి తక్షణం స్పందించిన తీరు పారిశుధ్యంపై ఆయన దృక్పథానికి స్పష్టమైన రుజువు.

గాంధీ ఒక చీపురు తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. దేశంలో పారిశుధ్య కార్యక్రమానికి అదే నాంది.పారిశుధ్య కార్యక్రమం కులరహిత, స్వేచ్ఛా సమాజాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో ఒక అంతర్గత భాగంగా ఉంటుందనేది గాంధీ అభిప్రాయం. అంటరానితనాన్ని తొలగించాలంటే పారిశుధ్యంపై వ్యక్తిగత బాధ్యతను పెంచాలని గాంధీ నొక్కి చెప్పేవారు. గుజరాత్‌లో ఒక రాజకీయ సదస్సులో పాల్గొన్న గాంధీ, ‘మన ఇళ్లు, వీధులు, రోడ్లు అన్నీ అపరిశుభ్రంగా ఉం టున్నాయి. సాంక్రమిక వ్యాధులు ప్రబలడానికి అవే కారణమ’న్నారు.మద్రాసులో కొంతమంది కార్మికులతో మాట్లాడుతూ ‘మన డ్రాయింగ్‌ రూమ్‌తో సమానంగా మరుగుదొడ్డిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పరిశుభ్రత, అం టరానితనం సమస్యలను గాంధీ ముడిపెడుతూ, మన సమాజంలో పాకీ పనిచేస్తున్న వారు ఎల్లప్పటికీ  నిమ్నస్థాయిలోనే ఉండిపోవడం తీవ్రమైన అన్యాయమ న్నారు. గాంధీ పరిశుద్ధ భారత్‌ ఆశయం సాకారం కావాలంటే 130 కోట్లకుపైగా భారతీ యులు స్వచ్ఛభారత్‌ని తమదిగా భావిం చాలని మోదీ అన్నారు. గాంధీ 150వ జయంతి ముగింపు వేడుకల వేళ అదే ఆయనకు ఘనమైన నివాళి కూడా.
కె.రాజశేఖరరాజు  

►‘పరిశుభ్రత, పారిశుధ్యం అనేవి రాజకీయ స్వాతంత్య్రం కంటే ముఖ్యమైనవి. ఆదర్శ గ్రామం అంటే పరిపూర్ణ పారిశుధ్యం అని అర్థం. స్వరాజ్‌ భావన ముందుగా మన వీధుల నుంచే మొదలుకావాలి.
మహాత్మాగాంధీ

►‘పరిశుద్ధ భారతదేశం మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా భారత్‌ ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళిగా ఉంటుంది.’
 ప్రధాని నరేంద్రమోదీ (2014 అక్టోబర్‌ 2న స్వచ్చభారత్‌ మిషన్‌  ప్రారంభం సందర్భంగా)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నాలుక’ను జయించి

నయా నిజం..గాంధీయిజం

లైలా..మజ్ను

మీ ప్రేమ బంధానికి ఓ తాళం వేసిరండి!

పర్యాటక రంగంతో శాంతికి ఊతం

నీడల ఊడ

సాహిత్య మరమరాలు : వచ్చాక చెప్పు

ఆమె భార్య అయ్యాక

ఒప్పుకునేవాడే మహాత్ముడు..

తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి.

ఆశయాల లేఖనం

గ్రేటర్‌ గృహాలంకరణ

ధైర్యం చేసి రాశా

టిక్‌టాక్‌ ఎడబాటు..ఫేస్‌బుక్‌ డిప్రెషన్‌

ఇలా ఉంటే గుండె బేఫికర్‌..

ప్రశ్నల మేఘాలు తొలగితే ప్రశాంత మహోదయం...

కర్తవ్యమ్‌

పూలకు పండగొచ్చింది

ఏడు నడకదారులు

అది..రాంచరణ్‌నే అడగండి: సుస్మిత

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

తారలు తరించిన కూడలి

ఆ చేతి బజ్జీ

రుచికి గొప్పాయి

ఈ వర్షాల్లో ఇమ్యూనిటీ పెంచుకోండిలా...

విశాఖ అందాలకు ఫిదా..

ఓ ట్రిప్పు వేసొద్దాం

విజయ విహారి

గర్భిణులు కాయధాన్యాలను ఎందుకు తినాలి?

స్టేషన్‌ ఎప్పుడొస్తుందో.. ఎదురు చూడ్డమెందుకు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

సైరా నాకో పుస్తకం

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

ఏపీలో ‘సైరా’ అదనపు షోలు

‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’