జకాత్‌... పేదలహక్కు

6 Jun, 2017 23:34 IST|Sakshi
జకాత్‌... పేదలహక్కు

రమజాన్‌ కాంతులు

ఇస్లామ్‌ అనే సౌధానికున్న మూలస్తంభాల్లో ఈమాన్, నమాజ్‌ల తరువాత జకాత్‌ మూడవ స్తంభం. పవిత్ర ఖురాన్‌ లో కనీసం 32 చోట్ల నమాజుతోపాటు జకాత్‌ ప్రస్తావన వచ్చింది. దీన్నిబట్టి జకాత్‌ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. జకాత్‌ అంటే పవిత్రత, పరిశుద్ధత అనే అర్థాలున్నాయి. కాని ఇక్కడ సంపన్నులు పవిత్రు లయ్యే ఉద్దేశ్యంతో సంవత్సరానికోసారి తమ సంపదలో నుండి రెండున్నర శాతం చొప్పున పేదసాదలకు, ధర్మసంస్థాపనా కార్యాలకు వెచ్చించవలసిన ధన, కనక వస్తువుల్ని ధార్మిక పరిభాషలో ‘జకాత్‌’ అంటారు. జకాత్‌ చెల్లింపును అల్లాహ్‌ విశ్వాసులకు విధిగా చేశాడు. ఇది విశ్వాసులలో ఉన్న సంపన్నుల నుండి వసూలు చేసి, నిరుపేదలకు అందజేయబడుతుంది.

ఖురాన్‌ ఏమి చెబుతుందంటే... ‘సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నులై నమాజును ఆచరిస్తూ, జకాత్‌ను నెరవేరుస్తూ ఉండేవారికి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం సిద్ధంగా ఉంటుంది. పరలోకంలో వారికి ఎలాంటి భయంకాని, దుఃఖంకాని ఉండదు’ కనుక ఈ పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఎవరి శక్తికి తగ్గట్టు వారు జకాత్‌ చెల్లించడాన్ని మరచిపోకూడదు.
–  ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు