వేయి పుణ్యాల మూట... షబె ఖద్ర్‌

22 Jun, 2017 00:53 IST|Sakshi
వేయి పుణ్యాల మూట... షబె ఖద్ర్‌

రమజాన్‌ కాంతులు

షబే ఖద్ర్‌ ఇస్లాం సంప్రదాయంలో పాటించే అతి పెద్ద పర్వదినం. ఎంతో గౌరవప్రదమైన, మరెంతో విలువైన ఈ రేయి శుభాలను ఏ ఒక్కరూ జారవిడుచు కోరాదు. ఎందుకంటే ఈ రాత్రి దైవదూతలతో భూలోకమంతా కిక్కిరిసిపోతుంది. కాబట్టి ఈ రాత్రి చేసే ఆరాధనలకు దైవం ఇచ్చే ప్రతిఫలాన్ని ఒడిసిపట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ రేయిలో వీలైనన్ని ఎక్కువసార్లు నఫీల్‌ నమాజులు, ఖుర్‌ ఆన్‌ పారాయణం చేయాలి. ఖుర్‌ ఆన్‌ భావాన్ని మనకు వచ్చిన భాషలో చదువుకోవాలి.

ధార్మిక పుస్తకాలను అధ్యయనం చేసి, ధార్మిక జ్ఞానాన్ని పెంపొదించుకోవాలి. మంచి జీవితాన్ని ప్రసాదించమని అల్లాహ్‌ను వేడుకోవాలి. మన ప్రవక్త (స) రమజాన్‌ నెల చివరి పదిరోజుల్లో దైవారాధనలో పూర్తిగా నిమగ్నం అవడమేగాక తన సహచరులను, ఇంటివారిని కూడా ప్రోత్సహించేవారు. మహాప్రవక్త (స) రమజాన్‌ చివరి వారంలో చేసినన్ని విస్తృత ఆరాధనలు మరే నెలలోనూ చేసేవారు కారని హజ్రత్‌ ఆయిషా (ర) తెలిపారు. కాబట్టి వెయ్యి నెలలపాటు అల్లాహ్‌ ఆరాధన చేసి పొందిన పుణ్యఫలం కంటే ఎన్నో రెటు... ఈ ఒక్కరోజు ఆరాధన చేసి పుణ్యాలు మూటకట్టుకోవచ్చు.
– బైరున్నీసాబేగం

మరిన్ని వార్తలు