అరుదైన చిరుధాన్యం..  సికియా!

22 May, 2018 11:29 IST|Sakshi

అరుదైన అతిచిన్న చిరుధాన్యం ‘సికియా’ మధ్యప్రదేశ్‌లో ఇటీవల వెలుగు చూసింది. బైగా గిరిజన రైతులు సికియా విత్తనాలను భోపాల్‌లో విత్తన జీవివైవిధ్య ప్రదర్శనకు తీసుకువచ్చారు. వాళ్లు దీన్ని సికియా అని పిలుస్తున్నారు. సంప్రదాయ విత్తద్యోమకారుడు నరేశ్‌ బిస్వాస్‌ ఈ చిరుధాన్యాన్ని వ్యాప్తిలోకి తేవడానికి శ్రమిస్తున్నారు. సికియా ధాన్యం నుంచి బియ్యం తయారు చేసుకుని సామల(లిటిల్‌ మిల్లెట్స్‌) మాదిరిగానే బైగా గిరిజనులు అన్నం వండుకుని తింటున్నారు.

ఇది మన ప్రాంతాల్లో కూడా ఉండేదా? ఉంటే, మన పూర్వీకులు ఏమని పిలిచేవాళ్లు? ఇప్పటికి ఇవి జవాబుల్లేని ప్రశ్నలే. ఇది అడవి జాతి రాగి మాదిరిగా ఉందని సహజ సమృద్ధ డైరెక్టర్‌ (బెంగళూరు) కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఇందులో పీచు, పిండిపదార్థాల వంటివి ఏ మోతాదులో ఉన్నాయో ప్రభుత్వ పరిశోధనా సంస్థలు అధ్యయనం చేయాలన్నారు. సికియా విత్తనాల కోసం.. Email: sahajaseeds@gmail.com

మరిన్ని వార్తలు