ఎవరు రక్ష?

26 Feb, 2017 01:21 IST|Sakshi
రాశి, ఐనా సాహాలకు సీన్‌ వివరిస్తున్న దర్శకుడు శ్రీముని

సీతను రావణుడు ఎత్తుకెళితే రాముడు విడిపించాడు. ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను ఏ రాముడు వచ్చి తీరుస్తాడు? రక్షణ లేని స్త్రీలకు ఎవరు ర క్ష? ఇక్కడ రక్షించేదెవరు? శిక్షించేదెవరు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘లంక’. రాశి లీడ్‌ రోల్‌ చేస్తోన్న ఈ చిత్రాన్ని నామన శంకరరావు, సుందరి సమర్పణలో రోలింగ్‌ రాక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థపై దినేష్‌ నామన, విష్ణుకుమార్‌ నామన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళను కూడా మన పూర్వీకులు మైండ్‌ టూ మైండ్‌ కమ్యూనికేట్‌ చేసేవారు. ఈ విద్యను టెలీపతి అనేవారు.

కనుమరుగైన ఈ విద్యను ప్రస్తుత సమాజానికి ‘లంక’  సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాం. రాశిని దృష్టిలో పెట్టుకుని కథ రాశాను’’ అని చిత్రదర్శకుడు శ్రీముని. ‘‘ఇది సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. టెలీపతి అనే విద్య ద్వారా లంక లాంటి ప్రస్తుత సమాజంలో స్త్రీలపై  జరిగే అన్యాయాన్ని ఏ విధంగా ఓ స్త్రీ సమర్థవంతంగా ఎదుర్కొంది అనేది కథ’’ అని కూడా దర్శకుడు తెలిపారు. ‘క్షణం’ చిత్రానికి సంగీత సారథ్యం వహించిన శ్రీచరణ్‌ స్వరాలను సమకూరుస్తున్నారు. ఐనా సాహా, సాయి రోనిక్, సిజ్జు, సుప్రీత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు