రియల్‌ లైఫ్‌ ట్రైలర్‌

6 Feb, 2018 00:26 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌ 

ఛాలెంజ్‌

అన్ని థియేటర్‌లలో ‘ప్యాడ్‌మ్యాన్‌’ ట్రైలర్‌ చూపిస్తున్నారు. ఈ ట్రైలర్‌ను చూస్తూ మహిళా ప్రేక్షకులు బిడియపడుతున్నారు. వాస్తవానికది ఒక మహోన్నతమైన సందేశాన్నిచ్చే చిత్రం. ‘మగవాళ్లకేం తెలుసు ఆడవాళ్ల ఇబ్బందులు. వాళ్లకేమైనా నెలసరి పాట్లు ఉంటే కదా’ అని హీరో అక్షయ్‌కుమార్‌ ట్రైలర్‌లో అంటాడు. ఎంత ఉన్నతమైన సందేశం అయినా, బహిరంగంగా వినడానికి, చూడ్డానికీ, మాట్లాడుకోడానికి మొహమాట పడే సబ్జెక్ట్‌ ఇది. పిక్చర్‌ ఈ నెల 9న రిలీజ్‌ అవుతోంది. ఆ లోగా సొసైటీని ఈ థీమ్‌కి, ఈ పిక్చర్‌కి మెల్లిమెల్లిగా రెడీ చేయడానికేనేమో బాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్‌లు సోషల్‌ మీడియాలో ‘ప్యాడ్‌మ్యాన్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించారు.

శానిటరీ ప్యాడ్‌ని చేత్తో పట్టుకుని ఫొటో తీయించుకుని దానిని అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇంతవరకు ఆమిర్‌ఖాన్, దీపికా పదుకోన్, అక్షయ్‌కుమార్, సోనమ్‌ కపూర్, అతిథి రావ్‌ హైదరీ, రాధికా ఆప్టే, ఆలియా భట్, దియా మీర్జా, ట్వింకిల్‌ ఖన్నా, స్వరా భాస్కర్, అర్జున్‌ కపూర్, ఆయుష్మాన్‌ ఖురానా, షబానా అజ్మీ.. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించారు. నేప్‌కిన్‌ ప్యాడ్స్‌ని కొని తేవడానికే తటపటాయించే మగధీరులు బహుశా ఈ సినిమా చూశాక కొద్దిగా ధైర్యాన్ని కూడా కొని తెచ్చుకోవచ్చు.

మరిన్ని వార్తలు